మీ ఓటు ఎవరికి వేశారో తెలుసుకోండి'

Published: Tuesday February 19, 2019
కాకినాడ: à°°à°¾à°¨à±à°¨à±à°¨ ఎన్నికల్లో ఓటర్లు ఓటు వేసిన తర్వాత వారు ఎవరికి ఓటు వేస్తున్నామో తెలుసుకునేందుకు ప్రత్యేకయంత్రం వీవీప్యాట్‌ను ఏర్పాటుచేశామని కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా తెలిపారు. కాకినాడ జేఎన్టీయూకే అలూమ్ని ఆడిటోరియంలో నూతన ఓటర్లకు స్వీప్‌ యాక్టివిటీస్‌ పేరుతో ఆర్డీవో జి.రాజకుమారి అధ్యక్షతన సోమవారం సాయంత్రం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న కలెక్టర్‌ కార్తికేయమిశ్రా విద్యార్థులకు ఈవీఎం, వీవీప్యాట్‌లు ఆఫ్‌లైన్‌, ఆన్‌లైన్‌ ద్వారా ఏ విధంగా ఓటు నమోదు చేసుకోవచ్చో వివరించారు. ఆఫ్‌లైన్‌లో బీఎల్వో పద్ధతిలో తహసీల్దార్‌, వీఆర్వో, వీఆర్‌ఏ ఆధ్వర్యంలో జరుగుతాయని... ఆన్‌లైన్‌లో వెబ్‌సైట్‌లో నమోదుచేసుకోవచ్చని ఆయన తెలిపారు. ఓటు నమోదుకు ఆధార్‌, ఫొటో, గుర్తింపు ధ్రువీకరణ పత్రం జతచేయాల్సి ఉంటుందని సూచించారు.
 
  1950నంబరుకు ఫోన్‌చేస్తే ఓటు నమోదు వివరాలు.. ఓటరు నంబరు ఏ పోలింగ్‌ కేంద్రంలో ఓటు వేయాలో తెలియజేస్తుందని కలెక్టర్‌ తెలిపారు. అదేవిధంగా ఓటు నమోదు చేసుకునేందుకు ప్రభుత్వం గుర్తించిన 16 ధ్రువీకరణ పత్రాల ద్వారా ఓటుహక్కు పొందవచ్చని చెప్పారు. ఎవరైనాసరే ఒకసారి ఓటు వేసిన తర్వాత యంత్రంలో మళ్లీ ఓటు నమోదు కాదని, వీవీప్యాట్‌లో 16మంది అభ్యర్థులను ఎంపిక చేసే బటన్స్‌ ఉంటాయని దాని లో చివరగా నోటా అనే ఆప్షన్‌ ఉంటుందని వివరించారు. ఓటు ఎలా వేయాలో తెలిసిన వారంతా కూడా తెలియనివారికి వివరించాలని ఆయన కోరారు. 18సంవత్సరాలు నిండిన ప్రతిఒక్కరూ తమ ఓటుహక్కును వినియోగించుకోవాలని, ఓటు అనేది సామాన్యుడి చేతిలో వజ్రాయుధం లాంటిదని గుర్తుచేశారు. జేఎన్టీయూ, రంగరాయ వైద్యకళాశాలల విద్యార్థులు సుమారు 600 మంది పాల్గొన్నారు. కలెక్టర్‌ విద్యార్థులతో స్వయంగా ఓటువేయించి అవగాహన కల్పించారు. అనంతరం విద్యార్థులు à°…à°¡à°¿à°—à°¿à°¨ పలు ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. కార్యక్రమంలో సెట్రాజ్‌ సీఈఓ ఎస్‌.మల్లిబాబు, ఆర్‌ఐ కృష్ణ, వీఆర్వోలు సాయి సత్యనారాయణ ప్రసాద్‌, శ్రీనివాస్‌, పలువురు రెవిన్యూ సిబ్బంది పాల్గొన్నారు.