పేరుకు విద్యాలయమైనా లోపల ఉగ్రవాద శిక్షణ

Published: Thursday February 28, 2019
 à°­à°¾à°°à°¤ విమానాలు బాలాకోట్‌లో బాంబులు వేసిన చోట అసలు ఏ ఉగ్రస్థావరాలూ లేవని.. à°† బాంబులు ఖాళీస్థలాల్లో పడ్డాయని.. వాటి వల్ల ప్రాణనష్టమేమీ జరగలేదని.. పాకిస్థాన్‌ చెబుతోంది! పాక్‌ మాటలు నిజమేనా? నిజంగానే అక్కడ జైషే మహ్మద్‌ ఉగ్రస్థావరం లేదా? అంటే.. అక్కడ నిజంగానే ఉగ్రస్థావరం ఉన్నట్టు తాము ఆధారాలు సేకరించామని రిపబ్లిక్‌ టీవీ à°’à°• కథనాన్ని ప్రసారం చేసింది. ఇమ్రాన్‌ఖాన్‌ సర్కారు పచ్చిఅబద్ధాలు చెబుతోందనడానికి అక్కడ ఉన్న à°’à°• సైన్‌బోర్డే నిదర్శనమని à°† కథనంలో పేర్కొంది. à°† కథనం ప్రకారం..
 
జైషే మహ్మద్‌ వ్యవస్థాపకుడు మసూద్‌ అజార్‌, అతడి బావమరిది- ఐసీ814 హైజాకర్‌ యూసుఫ్‌ అజార్‌à°² పేరిటే బాలాకోట్‌లో ఉగ్రవాద స్థావరం నడుస్తోంది. అందుకు రిపబ్లిక్‌ టీవీ చూపిన ఆధారం.. బాలాకోట్‌లోని మన్షేరా ప్రాంతంలో ఉన్న à°’à°• సైన్‌ బోర్డు. ‘మదర్సే తాలీమ్‌ అల్‌ ఖురాన్‌’ పేరిట ఉన్న à°† బోర్డుపై మసూద్‌ అజార్‌, యూసుఫ్‌ అజార్‌ ఇద్దరి పేర్లూ ఉన్నాయి. పైగా అది రిజిస్టర్డ్‌ మదర్సా. పైకి మదర్సాలాగా కనిపించినా అది అత్యంత విలాసవంతమైన ఉగ్రవాద శిక్షణ కేంద్రమని.. జల ఉగ్రవాదానికి సంబంధించిన శిక్షణ ఏర్పాట్లు కూడా అక్కడ ఉన్నాయని రిపబ్లిక్‌ టీవీ పేర్కొంది. ఆరు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న à°† టెర్రర్‌ ఫ్యాక్టరీలో.. తుపాకీ వినియోగంపై శిక్షణ ఇచ్చేందుకు అవసరమైన ఫైరింగ్‌ రేంజ్‌, వ్యాయామశాలలు, శిక్షణ గదులు, డార్మెటరీలు ఉన్నట్టు విశ్వసనీయవర్గాలను ఉటంకిస్తూ కథనంలో వెల్లడించింది. పాకిస్థాన్‌ దాన్ని మదర్సాగానే చెబుతూ బుకాయిస్తున్నప్పటికీ.. అంతర్జాతీయ వార్తా సంస్థలకు అదో ఉగ్రవాద శిక్షణ కేంద్రమన్న సంగతి తెలుసని, దాన్ని నిర్వహిస్తున్నది జైషే మహ్మద్‌ సంస్థేనని స్థానికులు కూడా ధ్రువీకరిస్తున్నారని స్పష్టం చేసింది.