కోస్తాకు వర్షసూచన

Published: Sunday March 03, 2019

 à°¦à°•à±à°·à°¿à°£ ఒడిశా పరిసరాల్లో ఏర్పడిన ఆవర్తనం, తెలంగాణ నుంచి రాయలసీమ మీదుగా తమిళనాడు వరకు కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో కోస్తాలో శనివారం అక్కడక్కడా వర్షాలు కురిశాయి. ఎస్‌.కోట, చోడవరం, కాకినాడల్లో రెండు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రానున్న ఇరవై నాలుగు గంటల్లో కోస్తాలో ముఖ్యంగా ఉత్తర కోస్తాలో ఈదురుగాలులు, ఉరుములతో వర్షాలు కురిసే అవకాశం వున్నదని వాతావరణశాఖ తెలిపింది. కాగా రాయలసీమలో పొడి వాతావరణం నెలకొంటుందని పేర్కొంది.