జనసేనలోకి మాజీ జేడీ లక్ష్మీనారాయణ..

Published: Sunday March 17, 2019
విజయవాడ: à°•à±Šà°¦à±à°¦à°¿à°°à±‹à°œà±à°²à±à°—à°¾ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్‌à°—à°¾ నిలుస్తున్నారు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ. సీబీఐ జేడీగా ఎన్నో సంచలన కేసులను దర్యాప్తు చేసిన ఆయన.. 2018 మార్చిలో స్వచ్చంద పదవీ విరమణ చేశారు. అప్పటి నుంచి సొంత రాష్ట్రానికి సేవ చేయాలనే ఉద్దేశ్యంతో ఏపీలో పర్యటిస్తున్నారు. రైతులు, మహిళలు, విద్యార్థులతో సమావేశాలు నిర్వహించి, వారి కష్టాలను తెలుసుకున్నారు. à°ˆ క్రమంలోనే ఆయన రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించారు. ఒకానొక సమయంలో సొంత పార్టీని ఏర్పాటు చేయబోతున్నట్లు వార్తలు కూడా వచ్చాయి. à°† తర్వాత ఎన్నికలకు సమయం దగ్గర పడిన కారణంగా పార్టీ పెట్టే ఆలోచనను విరమించుకున్నారని ప్రచారం జరిగింది.
 
వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా పోటీ చేస్తానని కొద్దిరోజుల క్రితం ప్రకటించడంతో లక్ష్మీనారాయణ ఏదొక పార్టీలో చేరడం ఖాయమనే టాక్ వినిపించింది. ఇక నాలుగు రోజుల క్రితమైతే.. ఆయన అధికార పార్టీ తెలుగుదేశం పార్టీలో చేరుతారని వార్తలు వినిపించాయి. ఏపీ మంత్రి à°—à°‚à°Ÿà°¾ శ్రీనివాసరావు కూడా à°ˆ మాజీ జేడీతో చర్చలు జరిపారని, ఆయనకు భీమిలి అసెంబ్లీ సీటు కానీ, విశాఖ ఎంపీ టికెట్ కానీ కేటాయించనున్నారని పుకార్లు షికార్లు చేశాయి. వీటన్నింటికి పుల్‌స్టాప్ పెడుతూ ఆయన సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆయన పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేనలో చేరాలని నిర్ణయించుకున్నారు.
 
 
మాజీ జేడీ లక్ష్మీనారాయణ.. జనసేనలో చేరనున్నారు. ఆదివారం ఉదయం 10.30 గంటలకు ఆయన.. పవన్‌ సమక్షంలో జనసేన కండువా కప్పుకోనున్నారు. లక్ష్మీనారాయణతో పాటు ఆయన తోడల్లుడు, మాజీ వీసీ రాజగోపాల్ కూడా జనసేనలో వెళ్లనున్నారు ఇందుకోసం ఆదివారం తెల్లవారుజామున à°’à°‚à°Ÿà°¿ గంటకు పవన్‌ను కలిశారు. లక్ష్మీనారాయణకు జనసేన నుంచి ఎంపీ సీటు ఇవ్వనున్నారని తెలుస్తోంది. à°ˆ మేరకు ఇప్పటికే పవన్ హామీ ఇచ్చారని, ఆయన పార్టీలో చేరిన వెంటనే పోటీ చేసే స్థానాన్ని కూడా అధికారికంగా ప్రకటించనున్నారనే టాక్ వినిపిస్తోంది.