జాతీయ సర్వేలకు అంతుపట్టని ఏపీ

Published: Wednesday March 20, 2019
2014... రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్రకు జరుగుతున్న తొలి ఎన్నికలవి! అనుభవజ్ఞుడైన చంద్రబాబు వస్తేనే కొత్త రాష్ట్రం నిలబడుతుందనే బలమైన నమ్మకం ఒకవైపు! తొలిసారి ఎన్నికలను ఎదుర్కొంటూ... రోడ్‌షోలతో జగన్‌ జోష్‌ ఒకవైపు! అప్పట్లో జాతీయ మీడియా సంస్థలు సర్వేల మీద సర్వేలు చేశాయి. ‘ఏపీ ఎన్నికల ఫలితం’ ఇదే అని వెల్లడించాయి. à°’à°• ప్రముఖ జాతీయ చానల్‌ ఏకంగా 18 ఎంపీ సీట్లను వైసీపీ గెలుచుకుంటుందని చెప్పింది. తెలుగుదేశం పార్టీ రెండు, ఇతరులు à°’à°•à°Ÿà°¿ గెలుచుకుంటారని చెప్పింది. ఇక... సీఎన్‌ఎన్‌ జాతీయ స్థాయిలో బాగా పేరున్న మీడియా సంస్థ. 2014 ఎన్నికల్లో ప్రత్యర్థి టీడీపీకంటే వైసీపీ అనేక మైళ్ల ముందుందని తెలిపింది. వైసీపీకి 41ు ఓట్లు పడతాయని... టీడీపీకి 28ు ఓట్లు వస్తాయని వెల్లడించిం ది. వైసీపీ గరిష్ఠంగా 19 సీట్లు గెలుచుకునే అవకాశముంద ని అంచనా వేసింది.
 
టీడీపీ 9-15 లోక్‌సభ సీట్లలో నెగ్గవచ్చునని తెలిపింది. కానీ చివరికి జరిగిందేమిటో అందరికీ తెలుసు! తాజాగా వైసీపీ 22 లోక్‌సభ స్థానాలు గెలుచుకుంటుందని చెప్పిన టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా కూడా à°—à°¤ ఎన్నికల సమయంలోనూ ఇదే మాట చెప్పింది. వైసీపీయే అధికారంలోకి వస్తుందని తేల్చింది. à°—à°¤ ఎన్నికల సమయంలో à°’à°• తెలుగు చానల్‌ కూడా సర్వే నివేదిక ఇచ్చింది. వైసీపీకి 122 స్థానాలు వస్తాయంది. టీడీపీ 46 సీట్లకు పరిమితమవుతుందని తేల్చేసింది. దీంతో... ‘ఇదిగో సర్వే! గెలుపు మాదే!’ అంటూ వైసీపీ శ్రేణులు ఊదరగొట్టాయి. జగన్‌ పత్రికలో, సోషల్‌ మీడియాలోనూ ఇదే హల్‌చల్‌! à°ˆ హడావుడి చూసి టీడీపీ శ్రేణులు గందరగోళంలో పడ్డాయి కూడా!
 
ఏమిటి కారణం?
 à°œà°¾à°¤à±€à°¯ స్థాయి మీడియా సంస్థలు దక్షిణాది ఓటర్ల నాడిని పసిగట్టడంలో ప్రతిసారీ విఫలమవుతున్నాయి. ఆయా సంస్థలకు ఏపీలో ఉండే ప్రతినిధులు తక్కువ. కొన్ని చానళ్లకు ఒక్క విలేకరి కూడా ఉండరు. మహా అయితే హైదరాబాద్‌లో ఒక్కరుంటారు! క్షేత్రస్థాయిలో పరిస్థితులు తెలియకుండా, తమదైన లెక్కలు వేసుకుని, అతి తక్కువ మందిని సంప్రదించి వారి అభిప్రాయాలనే రాష్ట్రం మొత్తం అభిప్రాయాలుగా తేల్చేసి సర్వే నివేదికలు ఇస్తుంటాయి. అయితే. ఎన్నికల సమయంలో జాతీయ చానళ్ల సర్వేలకు ఎక్కడలేని ప్రాముఖ్యత వచ్చేస్తుంది. ప్రత్యర్థి పార్టీలకు అందనంత ఎత్తులో ఉన్నామని చెబుతూ à°† పార్టీ శ్రేణుల స్థైర్యాన్ని దెబ్బతీయడం.. తమ పార్టీ కార్యకర్తలు జారిపోకుండా ఉండటమే ప్రధానంగా తప్పుడు సర్వేలు నడుస్తాయి. దీంతోపాటు ప్రజల్లో గందరగోళం సృష్టించడం లక్ష్యాల్లో భాగం!
 
బ్రాండ్‌ విలువ పెంచుకునేందుకు కొన్ని టీవీ చానళ్లు, సంస్థలు సర్వేలను విడుదల చేస్తున్నాయి. సర్వే నిజంగా చేశారా? శాం పిల్‌ సైజ్‌ à°Žà°‚à°¤? à°Žà°‚à°¤ శాస్ర్తీయంగా చేశారు? అనేది ముఖ్యం. శాస్త్రీయత లే కుండా చేసే సర్వేల వల్ల నిజమైన సర్వేలపై విశ్వసనీయత పోతోంది. రాష్ట్రంలో ఏ పార్టీకి ఎన్ని లోక్‌సభ స్థానాలు వస్తాయో చెబుతూ 2 సర్వేలు వెలువడ్డాయి. à°ˆ సర్వేలకు తీసుకున్న శాంపిల్‌ సైజ్‌ 16 వేలు. అంటే ఒక్కో అసెంబ్లీ సెగ్మెంట్‌లో సగటున నలుగురిని ప్రశ్నించినట్లు! అలాంటప్పుడు నిజమైన ప్రజాభిప్రాయం ఎలా తెలుస్తుంది? దీంతో కచ్చితత్వం ఉండదు.
 
‘‘రాష్ట్రంలో వైసీపీకి పరోక్షంగా సహకరిస్తు న్న బీజేపీనే ఢిల్లీ సంస్థలతో మాట్లాడి సర్వే సహకారం చేస్తున్నట్లు అనుమానాలున్నాయి. రాష్ట్రంలో రాజకీ à°¯ పరిస్థితి ఎలా ఉందో ప్రజలందరికీ తెలుసు. సంక్షేమ పథకాల బంధం ఓటర్లను కట్టిపడేస్తోంది. అభివృద్ది మం త్రం ఆకట్టుకుంది. ఇవన్నీ ఎవరు చేయగలిగారు? ఎవరు మాత్రమే మరింత చేయగలరు? అనేది ప్రజలు గ్రహించగలుగుతున్నారు. దీంతో à°“ టు ఎవరికి వేయాలో ఇప్పటికే నిర్ణయించుకున్నట్లు తె లుస్తోంది. అయినప్పటికీ... తిమ్మిని బమ్మి చేసే ప్రయత్నంలో భాగంగానే à°ˆ తప్పుడు సర్వేలు వస్తున్నాయి!’’ అని టీడీపీ సీనియర్‌ నేత ఒకరు విశ్లేషించారు.