ఇదేమీ పేకాట కాదు

Published: Friday March 22, 2019
‘28 కేసులు ఎదుర్కొంటూ 16 నెలలు జైల్లో ఉన్న జగన్‌.. ఒక్క అవకాశం ఇచ్చి గెలిపించాలని అడుగుతున్నాడు. ఇలాంటి వ్యక్తికి రాష్ట్ర తాళాలు ఎలా అప్పగిస్తాం? అవకాశం ఇవ్వడానికి ఇదేమీ పేకాట కాదు కదా! మీరు తీసుకునే నిర్ణయంపై ఐదు కోట్ల ఆంధ్రుల భవిష్యత్తు ఆధారపడి ఉంది. జగన్‌ అండ్‌ కో మామూలు దొంగలు కాదు... గజదొంగలు. రాష్ట్రం లో చంద్రబాబును ఓడించడానికి జగన్‌, కేసీఆర్‌, మోదీలు కలిసి అనేక కుట్రలు పన్నుతున్నారు. జగన్‌కు ఓటు వేస్తే కేసీఆర్‌కు వేసినట్లే’ అని మంత్రి లోకేశ్‌ హెచ్చరించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి మండలం కొలనుకొండ, వడ్డేశ్వరం, ఇప్పటం గ్రామాల్లో ఆయన రోడ్‌షో నిర్వహించారు.
 
రాష్ట్రంలో అభివృద్ధిని అడ్డుకోవడమే à°† ముగ్గురి లక్ష్యమని, టీడీపీని à°“à°¡à°¿à°‚à°šà°¿ పోలవరాన్ని, పోర్టులను ఆపించవచ్చన్నది కేసీఆర్‌ వ్యూహమని ఆరోపించారు. ‘మంగళగిరిలోని వైసీపీ ఎమ్మెల్యే ఏ రోజైనా మీ ముందుకు వచ్చారా? కనీసం ఆయన ఇల్లు ఎక్కడుందో మీకు తెలుసా? నేను మంత్రినై 25 మాసాలు గడిచినా నియోజకవర్గానికి à°ˆ పని కావాలని ఏనాడూ ఆయన అడగలేదు. స్థానిక నాయకులే వచ్చి అడిగితే గ్రామాలకు నిధులు ఇచ్చాను. రాజధానితో సహా అభివృద్ధి పనులను అడ్డుకునేందుకు ఆయన కేసులు వేశారు. నియోజకవర్గాన్ని, ప్రజలను పట్టించుకోకుండా ఏడాదంతా కోర్టుల చుట్టూ తిరుగుతారు. భారీ మెజారిటీతో నన్ను గెలిపించండి. మీ మధ్యే ఉంటా. మీ సమస్యలన్నీ తీరుస్తా. దేశంలోనే అత్యుత్తమ నియోజకవర్గంగా మంగళగిరిని తీర్చిదిద్దుతా’ అని లోకేశ్‌ హామీ ఇచ్చారు. ఇచ్చిన మాటకు కట్టుబడి సంక్షేమ పథకాలు అమలుచేస్తున్న చంద్రబాబు కావాలో... మాయమాటలు చెప్పి ఓట్లు దండుకోవాలని చూస్తున్న దొంగబ్బాయి కావాలో ఆలోచించి ఓటేయాలని పిలుపునిచ్చారు.