ప్రముఖులు పోటీ చేస్తున్న నియోజకవర్గాలపై ఆసక్తి

Published: Sunday March 24, 2019
ఇప్పుడు అందరి దృష్టి జిల్లాలోని నాలుగు అసెంబ్లీ స్థానాలపై కేంద్రీకృతమై ఉంది. జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌, మంత్రులు అయ్యన్నపాత్రుడు, à°—à°‚à°Ÿà°¾ శ్రీనివాసరావు, మాజీ ఎంపీ సబ్బం హరి... à°ˆ నలుగురూ పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో పరిస్థితి ఎలా ఉంది?, ఫలితం ఎవరికి అనుకూలంగా వస్తుంది?...అనే దానిపై అంతటా చర్చ జరుగుతోంది.
 
జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ గాజువాకపై గురి పెట్టారు. ఇక్కడ à°† పార్టీకి వేలల్లో సభ్యత్వం ఉంది. ఇంకా కాపు సామాజికవర్గం ఓట్లు కూడా అధికంగా ఉన్నాయి. యువత కూడా ఎక్కువే. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం తరఫున ఇక్కడ పోటీ చేసిన చింతలపూడి వెంకట్రామయ్య గెలుపొందారు. ఇవన్నీ కలిసి వస్తాయని పవన్‌కల్యాణ్‌ గాజువాక నుంచి పోటీకి దిగారు. నామినేషన్‌ వేసిన తరువాత ఆయన మొదట గాజువాకలోనే ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. మంచి స్పందన వచ్చింది. ఆయన తన స్థానంతో పాటు విశాఖ జిల్లాలో మరికొన్ని స్థానాలు జనసేన ఖాతాలో వేయించడానికే తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. గాజువాకలో టీడీపీ నుంచి సిటింగ్‌ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు బరిలో ఉన్నారు.
 
ఆయన సున్నిత మనస్కుడు. గాజువాకలో హౌస్‌ కమిటీ సమస్యకు పరిష్కారం చూపించారు. అందరికీ అందుబాటులో వుంటారనే పేరు తెచ్చుకున్నారు. స్థానిక నేతలకే పట్టం కట్టాలని ఆయన వర్గం ప్రచారం ప్రారంభించింది. వైసీపీ నుంచి గతంలో పోటీ చేసి ఓడిపోయిన తిప్పల నాగిరెడ్డే మళ్లీ ఇక్కడ పోటీకి దిగారు. విశాఖ మాజీ మేయరు పులుసు జనార్దనరావు బీజేపీ నుంచి నామినేషన్‌ వేశారు. ఇక్కడ ఎవరికి వారికి వర్గాలు ఉన్నాయి. యువత ఓట్లు కీలకంగా మారాయి. వారిని ఆకర్షించే వారికే విజయం లభిస్తుందనే వాదన వినిపిస్తోంది.