విధి నిర్వహణలో ఎలాంటి రాజీ ఉండకూడదు

Published: Wednesday April 03, 2019

పోలీసుశాఖలో పైఅధికారి చెప్పింది తలూపడం తప్ప ఎదురు మాట్లాడటం జరగదు!.. అదే రాష్ట్ర డీజీపీ అంటే.. సీఐ, ఎస్‌ఐ స్థాయి అధికారులు సైతం దరిదాపులకు వెళ్లేందుకూ సాహసించరు. అయితే విజయనగరం జిల్లా ఎస్‌.కోట పోలీసులు ఏకంగా డీజీపీ వాహనాన్ని ఆపి తనిఖీ చేయడం పోలీసుశాఖలో చర్చనీయాంశమైంది. విషయం తెలిసి జిల్లా పోలీసు యంత్రాంగం ఉలిక్కిపడింది. వివరాలివీ.. ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితిని అంచనా వేసేందుకు డీజీపీ ఠాకూర్‌ మంగళవారం ఏజెన్సీలోని అరకు వైపు వెళ్లారు. సమస్యాత్మక ప్రాంతం కావడంతో కాన్వాయ్‌లో కాకుండా విశాఖ నుంచి ప్రైవేటు వాహనంలో బయలుదేరారు. మరో ప్రైవేటు వాహనంలో సెక్యూరిటీ సిబ్బంది అనుసరించారు. విజయనగరం జిల్లా ఎస్‌.కోట ఫుట్‌ హిల్‌(బొడ్డవర) వద్దకు వచ్చేసరికి అక్కడి పోలీసులు వాహన తనిఖీలు చేస్తున్నారు. లోపల ఉన్నది డీజీపీ అని తెలియక సీఐ బి.వెంకటరావు, సర్వెలెన్స్‌ టీం అధికారి ఇందిర ఆయన కారు ఆపారు. పోలీస్‌ బాస్‌ కారు అద్దం దించగానే ‘బండి చెక్‌ చేయాలి సార్‌’ అన్నారు. ‘చేసుకోండి’ అంటూ ఆయన కారు దిగడంతో, వెనుక వాహనంలో ఉన్న డీజీపీ సెక్యూరిటీ సిబ్బంది కూడా కిందికి దిగారు. ఎస్‌ఐ వద్దకొచ్చి వారు ఏదో చెప్పబోతుండగా ‘à°† వాహనాన్ని కూడా చెక్‌ చేసుకోండి’ అంటూ ఠాకూర్‌ పోలీసులకు సూచించారు. అందులో ఆయుధాలు కనిపించడం, తాము ఆపింది బాస్‌ కారే అని తెలియడంతో పోలీసులు కంగారు పడ్డారు. జిల్లా ఎస్పీ దామోదర్‌, విశాఖపట్నం డీఐజీ పాలరాజు సైతం à°ˆ à°µà°¿à°·à°¯à°‚ తెలుసుకుని పోలీస్‌ బాస్‌కు ఫోన్‌ చేసి సారీ చెప్పారు. అయితే ఆయన లైట్‌ తీసుకున్నారు. విధి నిర్వహణలో ఎలాంటి రాజీ వద్దని, అందరి వాహనాలను ఒకేలా చూసి తనీఖీలు చేయాలని సూచించారు. ‘మనవాళ్లు మంచిపని చేశారు.. చాలా బాగా తనిఖీలు చేస్తున్నారు.. రివార్డ్‌ ఇవ్వండి’ అని ఆదేశించడం కొసమెరుపు.