ధన ప్రభావంతోనే మారిన ఓటర్ల ఆలోచన

Published: Monday April 15, 2019
జిల్లాలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఓటరు దేవుళ్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు, నేతలు ఎన్నో ప్రలోభాలకు గురి చేసినా.. తాను అనుకున్న అభ్యర్థి (పార్టీ)కే ఓటు వేసి తానే గెలిచానన్న సంబరంలో ఓటర్లు ఉన్నారన్న చర్చ సాగుతోంది. ఇదే సంబరంలో క్రాస్‌ ఓటింగ్‌ భారీగానే సాగిందని ఆయా పార్టీల్లో నేతల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా ధన ప్రభావంతో à°’à°• ఓటు టీడీపీ, మరో ఓటు వైసీపీకి వేశారని ప్రచారం సాగుతుండడంతో ఇది అభ్యర్థుల గెలుపుపై ప్రభావితం చేస్తుందని సమాచారం. à°—à°¤ ఎన్నికల్లో క్రాస్‌ ఓటింగ్‌ ప్రభావం అభ్యర్థుల ఫలితాలను తారుమారు చేసిన సందర్భాలున్నాయి. ఎన్నికలు బాగా ఖరీదై ఈసారి రూ.700 కోట్లకు పైగా ఖర్చు పెట్టడమే క్రాస్‌ ఓటింగ్‌కు కారణమైంది. జిల్లాలో పది అసెంబ్లీ, రెండు లోక్‌సభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో గెలుపు ఎవరిదన్నది గట్టిగా చెప్పలేని పరిస్థితి నెలకొంది. క్రాస్‌ ఓటింగ్‌ భారీగా జరిగితే అభ్యర్థుల గెలుపోటములపై మరింత ప్రభావం చూపుతుందని ఆయా పార్టీల నేతలు పేర్కొంటున్నారు.
 
సార్వత్రిక ఎన్నికల్లో ఒకేసారి లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగడంతో అభ్యర్థుల గెలుపుపై క్రాస్‌ ఓటింగ్‌ ప్రభావం ఎంతో కొంత ఉంటుంది. పోలింగ్‌ సరళిని పరిశీలించినప్పుడు ఏ మేరకు క్రాస్‌ ఓటింగ్‌ జరిగిందన్నది కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కానీ ఈసారి ఓటరు నాడిని నేతలు పట్టలేకపోతున్నారు. à°•à°¡à°ª లోక్‌సభ పరిధిలో à°•à°¡à°ª, బద్వేలు, మైదుకూరు, ప్రొద్దుటూరు, పులివెందుల, జమ్మలమడుగు, కమలాపురం నియోజకవర్గాలున్నాయి. à°ˆ నియోజకవర్గాల్లో ప్రధాన పోటీ టీడీపీ, వైసీపీల మధ్యే. ఎంపీ అభ్యర్థులుగా టీడీపీ నుంచి మంత్రి ఆదినారాయణరెడ్డి, వైసీపీ నుంచి అవినాష్‌రెడ్డి పోటీ పడ్డారు. రాజంపేట లోక్‌సభ పరిధిలో రాయచోటి, కోడూరు, రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. రాజంపేట లోక్‌సభ నుంచి టీడీపీ అభ్యర్థిగా సత్యప్రభ, వైసీపీ నుంచి మిథున్‌రెడ్డి తలపడ్డారు. కాగా అసెంబ్లీ స్థానాలకు ఇరుపార్టీలు బలమైన అభ్యర్థులనే బరిలోకి దింపి ఎంపీ అభ్యర్థులకు తోడ్పాటు అందించారు.
 
రెండు ప్రధాన పార్టీలు ఓటుకు నోటుతో ప్రసన్నం చేసుకునే పని జోరుగా సాగింది. ఓటుకు రూ.1000 నుంచి రూ.2 వేలు వరకు అందించడమే కాక గెలిచిన తరువాత రూ.1000 అందిస్తామని టోకన్లు కూడా జారీ చేశారు. ఇంతటితో ఆగకుండా మహిళలకు చీరలు, ముక్కుపుడకలు, యువతకు క్రికెట్‌ కిట్లు వంటి తాయిళాలను భారీగానే పంపిణీ చేశారు. ఇలా à°’à°• కుటుంబానికి వేల రూపాయల్లో అభ్యర్థుల నుంచి అందడం నాలుగు ఓట్లు à°† కుటుంబంలో ఉంటే రెండు ఓట్లు à°“ పార్టీకి మరో రెండు ఓట్లు మరో పార్టీకి వేశారని చర్చ సాగుతోంది. ప్రధాన పార్టీల సానుభూతిపరులుగా ఉన్న వారికి కూడా ఓటుకు నోటు అందడంతో టీడీపీ ఓటు వైసీపీకి, వైసీపీ ఓటు టీడీపీకి అన్నట్లుగా మారిందని సమాచారం. అసెంబ్లీ అభ్యర్థులు ఓటర్లకు దగ్గరగా వెళ్లి ప్రచారాలు నిర్వహించడంతో పాటు నేరుగా ప్రలోభాలు పెద్దఎత్తున చేపట్టడంతో అధిక ఓట్లు ఎమ్మెల్యే అభ్యర్థులకే పడే అవకాశం ఉంది. ఎంపీ అభ్యర్థి రెండో ఆప్షన్‌ à°•à°¿à°‚à°¦ తీసుకుని ఓట్లు వేయడంతో ఫలితాలు తారుమారవుతాయని చర్చ సాగుతోంది.
 
à°•à°¡à°ª లోక్‌సభ పరిధిలో మైదుకూరు, జమ్మలమడుగు, బద్వేలు, కమలాపురం నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీలు ఓటర్లను ఆకట్టుకునేందుకు భారీగానే ఖర్చు చేసినట్లు ఆయా పార్టీ నేతలే పేర్కొంటున్నారు. à°•à°¡à°ª, ప్రొద్దుటూరు నియోజకవర్గాల్లో ఓటర్లకు పంపిణీ కార్యక్రమాలు మిగిలిన నియోజకవర్గ స్థాయిల్లో జరగలేదు. ఈసారి ఎన్నికల్లో ప్రధాన పార్టీలు రూ.700 కోట్ల వరకు ఖర్చు చేయడం à°“ రికార్డుగా మారింది. 1, 2 నియోజకవర్గాల్లో రూ.వంద కోట్ల వరకు ఒక్కొక్క అభ్యర్థి ఖర్చు పెట్టినట్లు ప్రచారం సాగుతోంది.