నెల్లూరులో 2, గుంటూరులో 2 ప్రకాశం జిల్లాలో ఒకచోట రీపోలింగ్‌

Published: Wednesday April 17, 2019
 à°°à°¾à°·à±à°Ÿà±à°° వ్యాప్తంగా ఐదు పోలింగ్‌ కేంద్రాల్లో రీపోలింగ్‌కు కేంద్ర ఎన్నికల సంఘానికి సిఫారసు చేసినట్లు ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది వెల్లడించారు. గుంటూరు జిల్లాల్లో రెండు, నెల్లూరు జిల్లాల్లో రెండు, ప్రకాశం జిల్లాలో à°’à°• పోలింగ్‌ కేంద్రంలో రీపోలింగ్‌ కోసం సీఈసీకి సిఫారసు చేశామన్నారు. మంగళవారం అమరావతి సచివాలయంలో ద్వివేది విలేకరులతో చిట్‌చాట్‌ చేశారు. రీపోలింగ్‌ అంశంపై ఆయా జిల్లాల కలెక్టర్లు పరిశీలన చేసిన తర్వాత నివేదిక పంపించారని, à°† నివేదికను సీఈసీకి నివేదించామని ఆయన తెలిపారు. ‘కేంద్ర ఎన్నికల సంఘం నుంచి à°ˆ రీపోలింగ్‌కు సంబంధించిన ఆదేశాలు రావాల్సి ఉంది. విశాఖ, మచిలీపట్నం, నెల్లూరు జిల్లాల్లో జరిగిన ఎన్నికల నిర్వహణ ఘటనలపై ఈసీకి నివేదిక పంపించాం. ఈసీ ఆదేశాల మేరకు విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలుంటాయి. స్ట్రాంగ్‌ రూముల్లో ఉన్న ఈవీఎంలను ఎక్కడ ఉన్న వాటిని అక్కడే ఉంచాలని ఆయా జిల్లాల అధికారులను ఆదేశించాం. ఇతర రాష్ట్రాల్లో తదుపరి దశల్లో జరిగే పోలింగ్‌ కోసం ఏపీలో ఉపయోగించని ఈవీఎంలను తరలించాల్సి వస్తే రాజకీయ పార్టీలు, పోటీ చేసిన అభ్యర్థులు, మీడియా, అధికారుల సమక్షంలో పరిశీలించి వాటిని తరలిస్తాం.
 
 
స్ట్రాంగ్‌ రూమ్‌à°² వద్ద భద్రత కట్టుదిట్టం చేశాం. అదనపు భద్రత కల్పించాలని రాజకీయ పార్టీలు కోరాయి. దీనిపై డీజీపీని నివేదిక అడిగాం. విధుల్లో చిన్న పొరపాటు జరిగినా à°•à° à°¿à°¨ చర్యలుంటాయి. నెల్లూరు జిల్లా ఆత్మకూరు వీవీప్యాట్‌ స్లిప్పుల విషయంలో ఇప్పటికే రిటర్నింగ్‌ అధికారి, అదనపు రిటర్నింగ్‌ అధికారులపై కేసు నమోదైంది. ఘటన జరిగిన తర్వాత ఆధారాలు దొరకకుండా స్లిప్పులను తగులబెట్టే ప్రయత్నం చేశారు. జిల్లా కలెక్టర్‌ ఎన్వలప్‌ కవర్లను పరిశీలించగా, రెండు ఎన్వలప్‌ కవర్లలో స్లిప్పులు తగ్గాయి. ఎన్నికల విధుల్లో చిన్నచిన్న పొరపాట్లు జరిగి ఉండొచ్చు. అధిక సమయం పట్టినా పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటర్లు ఓపిగ్గా వేచి ఉండటం సంతోషదాయకం. సిబ్బంది కూడా పోలింగ్‌ పూర్తయ్యేంత వరకూ నిబద్ధతతో వ్యవహరించి అందరికీ ఓటు హక్కు కల్పించారు’ అని ద్వివేది చెప్పారు.