రాజాంలో మైనర్ల ఓటింగ్‌పై కమిషన్‌ సీరియస్‌

Published: Thursday April 18, 2019
 à°°à°¾à°·à±à°Ÿà±à°°à°‚లో ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహించారన్న ఆరోపణలపై ఎన్నికల కమిషన్‌ (ఈసీ) కొరడా ఝళిపించింది. కొందరిని సస్పెండ్‌ చేయగా.. ఇంకొందరికి షోకాజ్‌ నోటీసులు జారీచేసింది. మరికొందరిపై క్రిమినల్‌ కేసులు నమోదుచేయాలని ఆదేశించింది. కృష్ణా జిల్లా నూజివీడు నియోజకవర్గంలో నిబంధనలు పాటించని అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ ఆఫీసర్‌ (ఏఆర్వో) అయిన నూజివీడు తహశీల్దార్‌ పి.తేజేశ్వరరావును ఇప్పటికే సస్పెండ్‌ చేయగా.. ముసునూరు మండల ఏఆర్వో, తహశీల్దార్‌ ఎన్‌.నాగరాజు, నూజివీడు సబ్‌కలెక్టర్‌, రిటర్నింగ్‌ అధికారి (ఆర్వో) అయిన స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌కు కూడా కమిషన్‌ నోటీసు జారీచేసినట్లు సమాచారం. ముసునూరు మండలం వలసపల్లిలోని 75à°µ పోలింగ్‌బూత్‌లో మొత్తం 682 ఓట్లు ఉండగా.. వీటిలో పోలింగ్‌ రోజు 643 ఓట్లు పోలయ్యాయి. పోలింగ్‌ నాడు ఉదయం తొలుత మాక్‌పోలింగ్‌ జరిగింది.
 
మాక్‌ పోలింగ్‌లో పోలైన ఓట్లను తొలగించకుండానే అధికారులు.. అసలు ఓటింగ్‌ను ప్రారంభించారు. సాయంత్రం పోలింగ్‌ ముగిశాక లెక్కలు తీస్తే.. బూత్‌లో ఉన్న మొత్తం ఓట్లకన్నా ఎక్కువ ఓట్లు నమోదైనట్లు తేలడంతో అధికారులు కంగుతిన్నారు. మాక్‌పోలింగ్‌ ఓట్లు తొలగించలేదని గుర్తించారు. దీంతో ముసునూరు ఏఆర్వో నాగరాజుపై చర్యలు తీసుకోవడానికి à°°à°‚à°—à°‚ సిద్ధమైంది. డమ్మీ ఈవీఎంలను నిబంధనలు పాటించకుండా తరలించడం, అలాగే నూజివీడు సారథి ఇంజనీరింగ్‌ కళాశాలలోని స్ర్టాంగ్‌రూమ్‌లో పోలింగ్‌రోజున పోలింగ్‌ కేంద్రాల నుంచి వచ్చిన ఈవీఎంలను భద్రపరిచే విషయంలో, వాటిని ఓట్లలెక్కింపు కేంద్రానికి తరలించే విధానంలోనూ నిబంధనలు పాటించనందుకు నూజివీడు తహశీల్దార్‌పై ఇప్పటికే ఈసీ చర్యలు తీసుకుంది. ఆర్వో చెప్పిన విధంగానే తాము విధులు నిర్వహించామని ఏఆర్వోలు రాతపూర్వకంగా వివరణ ఇవ్వడంతో స్వప్నిల్‌ దినకర్‌కు కూడా నోటీసు జారీచేసినట్లు సమాచారం.
 
ఆర్వో ఇచ్చే వివరణను బట్టి వీరిపై నిర్ణయాలు ఉంటాయి. ఇంకోవైపు.. తూర్పుగోదావరి జిల్లా మండపేట మండలం మారేడుబాకలో 108à°µ పోలింగ్‌బూత్‌కు సంబంధించిన ఓటరు స్లిప్పులు, అమలాపురం బీజేపీ ఎంపీ అభ్యర్థి మానేపల్లి అయ్యాజీవేమాకు సంబంధించిన ఈవీవీప్యాడ్‌ ఓటు స్లిప్పులు చెత్తకుప్పలో దొరికిన ఘటనకు సంబంధించి ప్రిసైడింగ్‌ అధికారి à°—à°‚à°Ÿà°¾ లత, అసిస్టెంట్‌ ప్రిసైడింగ్‌ అధికారి ముచ్చుకరెడ్డిపై క్రిమినల్‌ కేసు నమోదు చేశారు. ఎన్నికలు విధుల్లో వీరిద్దరూ నిర్లక్ష్యంగా వ్యవహరించారని నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి చుక్కా వెంకటేశ్వరరావు జిల్లా కలెక్టర్‌కు మంగళవారం నివేదిక పంపారు.