దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ టాప్‌

Published: Sunday May 19, 2019
రాజస్థాన్‌లోని à°’à°• అసెంబ్లీ నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థి ఖర్చు రూ.2.5కోట్లు. అక్కడ రెండో అభ్యర్థినీ కలుపుకొంటే, à°ˆ ఎన్నికల్లో వారు పెట్టిన వ్యయం ఐదుకోట్లు. అక్కడ కొన్ని సీట్లలో కాస్త ఎక్కువ, కొన్ని సీట్లలో ఇంతకంటే చాలా తక్కువగా కూడా ఖర్చు ఉండొచ్చు. సగటు ఖర్చు మాత్రం ఇంతే. à°† రాష్ట్రంలో అసెంబ్లీ స్థానాలు 200. అంటే అక్కడ మొత్తం స్థానాల్లో ఖర్చు వెయ్యి కోట్లు. మరి మన రాష్ట్రం సంగతికి వస్తే, రాష్ట్రమంతా కౌంట్‌ అవసరం లేదు. ఉన్న 175సీట్లపై లెక్కలు తీయాల్సిన పనీ ఉండదు. కేవలం గుడివాడ, మైలవరం, గన్నవరం, చిలకలూరిపేట, పెదకూరపాడు, వినుకొండ, మంగళగిరి, నెల్లూరు సిటీ, విశాఖపట్నం నార్త్‌, అద్దంకి స్థానాల్లో అయిన ఎన్నికల ఖర్చు గణిస్తే చాలు. వీటిలో ఒక్కో స్థానంలో తెలుగుదేశం, వైసీపీ అభ్యర్థుల ఖర్చు కలిపితే రూ.100కోట్లు దాటేసింది. అంటే, à°ˆ 10 అసెంబ్లీ స్థానాల ఖర్చే వెయ్యి కోట్లన్న మాట. ఆర్థికపరమైన సమస్యలతో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల ఖర్చు విషయంలో రాజస్థాన్‌నే దాటేసింది. కళ్లు తిరిగేలా రాష్ట్రంలో కట్టలు తెగాయి.
 
 
మోదీ తెచ్చిన కొత్త రెండువేలు నోటు, ఎలాగైనా గెలవాలనే మితిమీరిన తపన...విచ్చలవిడిగా డబ్బు పారించాయి. సాధారణంగా ఎన్నికల ఖర్చు దక్షిణాది రాష్ట్రాలు కాస్త ఎక్కువగానే పెడతాయి. కర్ణాటక, తెలంగాణ, తమిళనాడులో ఖర్చు విపరీతం. à°ˆ ఎన్నికలతో వాటి రికార్డులను ఆంధ్రప్రదేశ్‌ దాటేసింది. అంతేకాదు, మధ్యప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌, బీహార్‌ తదితర హిందీ రాష్ట్రాలు, ఒడిశా, కేరళ లాంటి దక్షిణాది రాష్ట్రాలు, కాస్త ఎక్కువ ఖర్చు చేసే మహారాష్ట్ర లాంటి రాష్ట్రం, దేశ రాజధానికి దగ్గరగా ఉండే పంజాబ్‌, హరియాణా, ఢిల్లీలాంటి రాష్ట్రాలు... ఇలా ఎందెందు వెదికినా ఇంత ఖర్చు కనిపించదు.
 
రాష్ట్రంలో మొత్తం ఎన్నికల ఖర్చు ఎంతో చూస్తే...వామ్మో అనక తప్పదు. 10నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీలు తెలుగుదేశం, వైసీపీల అభ్యర్థులు పెట్టిన ఖర్చే వెయ్యికోట్లు దాటేసింది. ఇవి మరీ తెగించేసిన స్థానాలు. వీటిని పక్కనపెడితే సగటున ప్రతి నియోజకవర్గంలోను ఒక్కో పార్టీ అభ్యర్థి రూ.20 కోట్లు ఖర్చుచేశారు. ఇద్దరు అభ్యర్థులనే తీసుకున్నా రూ.40కోట్లు. అంటే 175అసెంబ్లీ నియోజకవర్గాల్లోను పెట్టిన ఖర్చు సుమారు రూ.6వేల కోట్లు. అసెంబ్లీ అభ్యర్థులు, వారికి ఎంపీ స్థానాల అభ్యర్థులు ఇచ్చిన ఖర్చు కూడా దీనిలోనే కలిసుంది. జనసేన, ఇతర స్వతంత్ర అభ్యర్థులు పెట్టిన ఖర్చు అదనం. అది కూడా కలిపితే లెక్క ఇంకాస్త పెరుగుతుంది. ఈ మొత్తం ఖర్చులో దాదాపు సగం అంటే రూ.3వేల కోట్లు ప్రధాన పార్టీల అధిష్ఠానం నుంచి అందినట్టు సమాచారం.
 
రెండుసార్లు పంచారు..
à°ˆ ఎన్నికల్లో మన రాష్ట్రంలో గతానికి భిన్నంగా రెండుసార్లు పంచారు. మొదటి విడతలోనే చాలా నియోజకవర్గాల్లో వెయ్యి రూపాయలు పంచారు. గతంలో రూ.300 పంచిన చోట్ల కూడా ఈసారి వెయ్యి ఇచ్చారు. రూ.500 పంచినచోట్ల ఈసారి రెండువేలు పంచేశారు. చివరకు రీపోలింగ్‌ పెట్టిన కేంద్రాల్లో ఏకంగా మూడువేలు కూడా పంచారు. గతంలో రిజర్వుడు నియోజకవర్గాల్లో వందల్లోనే పంచేవారు. ఈసారి వాటిల్లోను వేలల్లోకి వచ్చేసింది. ఏ ఎన్నికల్లోనైనా పార్టీలు ఒక్కసారే డబ్బు పంచుతాయి. ఈసారి మాత్రం 20-25 స్థానాల్లో రెండోసారి కూడా డబ్బులు పంచారు. ప్రత్యర్థిని ఎట్టి పరిస్థితుల్లోను మట్టి కరిపించాలన్న లక్ష్యం à°ˆ దిశగా అభ్యర్థులను నడిపించింది. సాధారణంగా పోలింగ్‌ రోజుకు ముందు రాత్రి డబ్బుల పంపిణీ చేస్తారు. అయితే ఈసారి à°’à°• పార్టీ రూట్‌ మారింది. చాలా ముందుగానే డబ్బు సిద్ధం చేసేసింది. పోలింగ్‌కు నెలరోజుల ముందే ఆరు జిల్లాల్లో డబ్బు డంప్‌ చేసేసింది. రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో à°ˆ పనిచేసింది. మిగిలిన ఏడుజిల్లాల్లో కూడా పదిరోజుల ముందే సిద్ధం చేసుకుంది. అంతేకాదు...పంపిణీ కూడా చివరి రోజు రాత్రివరకు ఆగలేదు. నాలుగు రోజుల ముందే పంపిణీ చేసేశారు. ఇది ఓటర్లకు, ప్రత్యర్థి పార్టీలకు కూడా షాకే. అయితే అంతలోనే తేరుకున్న ప్రత్యర్థి పార్టీలు కూడా రంగంలోకి దిగాయి. కిందా మీదా పడి సర్దుకోగలిగాయి. ఇలా ముందస్తు పంపిణీ రాష్ట్రంలో ఇదే తొలిసారి.
 
ఈసారి గ్రామ, మండల స్థాయి నేతల వరకూ ప్రలోభాల పర్వం పాకిపోయింది. గ్రామస్థాయిలో ఫలానా నాయకుడు వస్తే ఇంత.. మండల స్థాయి వాళ్లు వస్తే ఇంత.. అంటూ బేరాలకు దిగారు. గుంటూరు జిల్లాలో à°’à°• నియోజకవర్గంలో వైసీపీకి చెందిన అభ్యర్థి కొత్తగా బరిలో దిగారు. పెద్దగా కార్యకర్తలు, కిందిస్థాయి నేతలూ ఆయన వెంట లేరు. దీంతో తెలుగుదేశం పార్టీలో కిందిస్థాయి నేతలపై ఆయన కన్నేశారు. ప్రలోభాల వల విసిరారు. à°’à°• నియోజకవర్గంలో ప్రత్యర్థి పార్టీకి చెందిన మున్సిపల్‌ స్థాయి నేతను తనవైపు తిప్పుకునేందుకు కోట్లు ఖర్చుచేశారు. కిందిస్థాయి నేతలకు కూడా ఖర్చు పెట్టడం ఎన్నికల వ్యయ్యాన్ని వరదలెత్తించింది.