అభినందించిన ప్రధాని మోదీ.. గెలవాలని కోరుకున్నట్టు వెల్లడి

Published: Monday May 27, 2019
అద్భుతం జగన్‌.. మీరు మహాద్భుతంగా విజయం సాధించారు’’ (ఎక్సలెంట్‌ జగన్‌, యు హావ్‌ డన్‌ వండర్‌ఫుల్‌ జాబ్‌).. అని ఆదివారం వైసీపీ అధినేత, ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను చూడగానే ప్రధాని నరేంద్రమోదీ హర్షాతిరేకంతో స్పందించారు. ఆంధ్రప్రదేశ్‌లో à°…à°–à°‚à°¡ విజయం సాధించినందుకు జగన్‌ను అభినందించారు. ‘‘మీరు గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా’’ అని మోదీ చెప్పారు. అంతేకాదు, మీరు చాలా కష్టపడ్డారు. పాదయాత్ర చేస్తూ నిరంతరం జనంలో ఉన్నారు.. మీ కష్టానికి ప్రతిఫలం దక్కింది.. అని మోదీ జగన్‌ను కొనియాడినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ప్రధానిని కలిసేందుకు ఢిల్లీకి వెళ్లిన జగన్‌ దాదాపు గంటసేపు మోదీతో భేటీ అయ్యారు. à°ˆ సమావేశం ఆద్యంతం ఆహ్లాదకరంగా సుహృద్భావ వాతావరణంలో జరిగిందని à°ˆ వర్గాలు చెప్పాయి. à°ˆ నెల 30à°¨ జరగనున్న తన సీఎం ప్రమాణ స్వీకారానికి రావాలంటూ à°ˆ సందర్భంగా జగన్‌.. మోదీని ఆహ్వానించారు. అయితే, అదేరోజు సాయంత్రం ప్రధానిగా తాను ప్రమాణ స్వీకారం చేస్తున్నందున రాలేనని, తన శుభాశీస్సులు ఎప్పుడూ ఉంటాయని మోదీ జగన్‌తో అన్నట్టు తెలిసింది.
 
కాగా, ప్రధానమంత్రి నివాసానికి జగన్‌తో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం, ఎంపీలు విజయసాయిరెడ్డి, సుధాకర్‌రెడ్డి, బాలశౌరి, అవినాశ్‌రెడ్డి, మిథున్‌రెడ్డి, మార్గని భరత్‌, నందిగం సురేశ్‌ వెళ్లారు. జగన్‌ వారిని ప్రధానికి పరిచయం చేశారు. అనంతరం, ఎల్వీ సుబ్రమణ్యంతో కలిసి ప్రధానికి రాష్ట్ర సమస్యలను, ఆర్థిక పరిస్థితిని వివరించారు. చివరకు మోదీ, జగన్‌ 15 నిమిషాల సేపు ఏకాంతంగా చర్చించారు. ప్రధానికి జగన్‌ శాలువ కప్పి, తిరుమల శ్రీవారి మొమెంటోను అందజేశారు. à°† తర్వాత అమిత్‌ à°·à°¾ నివాసానికి వెళ్లారు. ప్రధాని సూచన మేరకే జగన్‌, అమిత్‌ షాను కలుసుకున్నట్లు సమాచారం. షాతో కూడా జగన్‌ కొద్ది సేపు ఏకాంతంగా చర్చలు జరిగారు. రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన తీరును వివరించడంతోపాటు రాష్ట్ర సమస్యలపై కూడా షాతో చర్చించారు. ఇదిలావుంటే, జగన్‌ని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌ కూడా కలిశారు. ఎన్నికల్లో గెలిచినందుకు శుభాకాంక్షలు తెలిపారు.