జగన్‌ ప్రమాణ స్వీకారానికి.. ఏర్పాట్లు ముమ్మరం

Published: Monday May 27, 2019
రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్మోహనరెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమ ఏర్పాట్లు తుది ఘట్టానికి చేరుకున్నాయి. కృష్ణాజిల్లా యంత్రాంగం ఏర్పాట్లలో తలమునకలై ఉంది. రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల నుంచి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పెద్దఎత్తున ప్రజలు తరలి వచ్చే అవకాశం ఉండటంతో à°† దిశగా స్టేడియం లోపల, బయట ఏర్పాట్లు చేపట్టారు. అంచనాలను మించి వచ్చినా వీక్షించేందుకు నగరంలోని ముఖ్య కూడళ్లలో భారీ ఎల్‌ఈడీ స్ర్కీన్లను ఏర్పాటు చేయబోతున్నారు. à°ªà±à°°à°®à°¾à°£ స్వీకారోత్సవ కార్యక్రమాన్ని వీలైనంత నిరాడంబరంగానే నిర్వహించాలన్ని రాష్ట్ర అధికార యంత్రాంగానికి కాబోయే ముఖ్యమంత్రి జగన్‌ సూచించినట్టు సమాచారం. à°•à°¾à°°à±à°¯à°•à±à°°à°®à°¾à°¨à°¿à°•à°¿ à°…à°° లక్షమంది వరకు వస్తారని అంచనా వేస్తున్న నేపథ్యంలో, వారికి మంచినీరు, స్నాక్స్‌, మజ్జిగ వంటివి ఏర్పాటు చేయాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది.
 
జగన్‌ను ముఖ్యమంత్రిగా చూడాలన్న రాష్ట్ర ప్రజల తొమ్మిదేళ్ల నిరీక్షణ à°ˆ నెల 30à°µ తేదీన సాకారం కాబోతోందని వైసీపీ పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి అన్నారు. ఈనెల 30à°¨ జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్న ఐజీయం స్టేడియంలో ఏర్పాట్లను జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు ఆదివారం పరిశీలించారు. à°ˆ సందర్భంగా పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్దపారధి మీడియాతో మాట్లాడుతూ ప్రమాణస్వీకారాన్ని నిరాడంబరంగా నిర్వహించాలని స్టేడియంలో ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
 
ముఖ్యమంత్రి ప్రమాణస్వీకార కార్యక్రమానికి పటిష్ట ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ ఇంతియాజ్‌ అఽధికారులను ఆదేశించారు. జగన్మోహన్‌రెడ్డి ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ఏర్పాట్లపై క్యాంపు కార్యాలయంలో వీఎంసీ కమిషనర్‌ à°Žà°‚.రామారావు, ఎమ్మెల్యేలు పార్ధసారథి, వెలంపల్లి శ్రీనివాస్‌, మల్లాది విష్ణు, à°Žà°‚.నాగార్జున, సాధారణ పరిపాలనా శాఖ అడిషనల్‌ కార్యదర్శి (ప్రొటోకాల్‌) à°Žà°‚.అశోక్‌బాబు, వైఎస్‌ఆర్‌ సీపీ ప్రోగ్రామింగ్‌ కో-ఆర్డినేటర్‌ తలశిల రఘురామ్‌, డీసీపీలు రవిశంకర్‌రెడ్డి, వి.హర్షవర్ధన్‌రాజులతో కలిసి కలెక్టర్‌ ఆదివారం చర్చించారు. ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌, పలువురు న్యాయమూర్తులు హాజరు కానున్నట్టు తెలిపారు.
 
ప్రధాన వేదిక ముందు భాగంలో వీవీఐపీ, వీఐపీ, మీడియాకు ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమానికి హాజరయ్యే వారికి ప్రత్యేక పాస్‌లను జారీ చేయాలన్నారు. ఏఆర్‌ గ్రౌండ్స్‌, బిషప్‌ అజరయ్య స్కూల్‌, పీడబ్యూడీ గ్రౌండ్స్‌లలో వాహనాల పార్కింగ్‌కు ఏర్పాట్లు చేయాలని అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. జేసీ-2 పి.బాబూరావు, సమాచార, పౌర సంబంధాలశాఖ జాయింట్‌ డైరెక్టర్‌ కిరణ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.