కాఫర్‌ డ్యాం పనులు ఆపేయండి

Published: Wednesday May 29, 2019
నిర్వాసితుల ఫిర్యాదు, ముంపు ముప్పు నేపథ్యంలో పోలవరం కాఫర్‌ డ్యామ్‌ పనులను తాత్కాలికంగా నిలిపి వేయాలని పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) ఆదేశించింది. ఇప్పటి వరకు వేసిన కట్టను మాత్రం పటిష్ఠ పరచాలని సూచించింది. మంగళవారం విజయవాడలో జల వనరుల శాఖ క్యాంపు కార్యాలయంలో ప్రాజెక్టు నిర్మాణ పనులు, నిర్వాసితులకు సహాయ పునరావాస కార్యక్రమాల అమలు తదితర అంశాలపై పీపీఏ చైర్మన్‌ ఆర్కే జైన్‌ అధ్యక్షతన సమీక్ష జరిగింది. కాఫర్‌ డ్యామ్‌ నిర్మాణంతోపాటు సహాయ, పునరావాస చర్యలపై ఆయన ఆరా తీశారు. ముంపు ప్రాంతాలను ఖాళీ చేయించి, పునరావాసం కల్పించని నేపథ్యంలో... కాఫర్‌ డ్యామ్‌ పూర్తయితే ఆయా ప్రాంతాలు ముంపునకు గురయ్యే అవకాశముందని జైన్‌ పేర్కొన్నారు. అందువల్ల పనులను తాత్కాలికంగా నిలిపివేయాలని సూచించారు.
 
‘‘2480 మీటర్ల పొడవునా ఎగువ కాఫర్‌ డ్యాం నిర్మించాల్సి ఉంది. పోలవరం వైపు 400 మీటర్ల మేర ఇంకా పనులు చేపట్టలేదు. దీంతో మొత్తం గోదావరి ప్రవాహం à°ˆ 400 మీటర్ల పొడవునా దిగువకు ప్రవహిస్తుంది. తూర్పు గోదావరి వైపు మరో 250 మీటర్లలో కాఫర్‌ పనులు ప్రారంభించగా.. 20 మీటర్ల లెవెల్‌ వరకు నిర్మాణం జరిగింది. మధ్యలో మరో 1800 మీటర్ల పొడవున 35 మీటర్ల లెవెల్‌ వరకు నిర్మాణం పూర్తయింది’’ అని ఇంజనీరింగ్‌ అధికారులు తెలిపారు. వరద 26 మీటర్ల ఎత్తుకు చేరితే ఆయా గ్రామాలు ముంపునకు గురవుతాయని ఇప్పటికే నిర్వాసితులు ఫిర్యాదు చేశారని, దీనికి సంబంధించి ఏ విధమైన చర్యలు తీసుకుంటారని పీపీఏ సభ్యులు అడిగారు. దీనిపై జంగారెడ్డిగూడెం ఆర్డీవో మోహన్‌ కుమార్‌ స్పందిస్తూ.. ఆయా గ్రామాలకు ముందస్తుగా మూడు నెలలకు సరిపడా నిత్యావసరాలు అందిస్తామని చెప్పారు.
 
à°ˆ భేటీలో చీఫ్‌ ఇంజనీర్‌ ఏకే ప్రధాన్‌, జల వనరుల శాఖ ఈఎన్‌సీ à°Žà°‚.వెంకటేశ్వరరావు, ప్రాజెక్టు సీఈ వి.శ్రీధర్‌, ఈఈలు సుధాకర్‌, శ్రీనివాస్‌, నవయుగ ప్రాజెక్టు మేనేజర్‌ క్రాంతి తదితరులు పాల్గొన్నారు. కాగా, బుధ, గురువారాల్లో ప్రాజెక్టు క్షేత్ర స్థాయి పర్యటన చేయాలని పీపీఏ నిర్ణయించింది. అక్కడ గుర్తించినఅంశాలతో మళ్లీ 31à°¨ విజయవాడలో సమీక్ష జరుపుతారు.
 
 
మున్ముందు కూడా రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణలోనే పోలవరం ప్రాజెక్టు పనులు జరుగుతాయని పీపీఏ చైర్మన్‌ ఆర్కే జైన్‌ స్పష్టం చేశారు. త్వరలోనే సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌)-2కు ఆమోదం లభిస్తుందని సమీక్ష సమావేశానంతరం మీడియాకు వెల్లడించారు. రాష్ట్రానికి కేంద్రం ఇంకా రూ.2 వేల కోట్లే చెల్లించాల్సి ఉందని.. రాష్ట్రప్రభుత్వం చెబుతున్నట్లుగా రూ.4,800 కోట్లు కాదన్నారు. వచ్చే ఏడాది జూన్‌ నాటికి గ్రావిటీతో నీళ్లిస్తామని స్పష్టం చేశారు.