పేదలకు సొంతింటిభాగ్యం హామీ... ఖరీదైనది

Published: Monday June 03, 2019
రాష్ట్రంలోని అర్హులైన పేదలకు సొంతింటిభాగ్యం కల్పించాలంటే ప్రభుత్వం భారీ ఆర్థిక భారాన్ని మోయాల్సి ఉంటుంది. వెయ్యి లేదా రెండు వేలు కాదు.. ఏకంగా రూ.6000 కోట్లు కావాల్సిందే. ప్రభుత్వ భూమి చాలా తక్కువగా ఉండటం, వేలాది ఎకరాల ప్రైవేటు భూమిని కొనుగోలు చేయాల్సి రావడంతో à°ˆ హామీ ఖరీదైనదిగా నిలుస్తోందని అధికారులు భావిస్తున్నారు. తాము అధికారంలోకి వస్తే అర్హులైన పేదలకు సొంతింటిభాగ్యం కల్పిస్తామని ఎన్నికల సమయంలో వైసీపీ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. వైసీపీ హామీలపై రెవెన్యూశాఖ కొన్ని రోజులుగా వివిధ అంశాలపై కసరత్తు చేస్తూ బడ్జెట్‌ లెక్కలు వేస్తోంది. తాజాగా ఇళ్లస్థలాలపై కసరత్తు చేపట్టింది. à°ˆ ఏడాది మార్చి నాటికి అందుబాటులో ఉన్న డేటాతోపాటు కొత్తగా వచ్చే దరఖాస్తులను పరిశీలనలోకి తీసుకొంటే కనీసం ఏడు లక్షల మందికి సొంతింటి భాగ్యం
కల్పించాల్సి ఉంటుంది. ఇవి గతంలో ప్రభుత్వం ఆమోదించిన గణాంకాలే. అధికారిక సమాచారం ప్రకారం... తమకు సొంత ఇళ్లు కావాలని, ఇంటిస్థలం కేటాయించాలని 12 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో ఏడు లక్షల మంది అర్హులని ఇంతకు ముందే రెవెన్యూశాఖ తేల్చింది. ఐదు లక్షల దరఖాస్తులను తిరస్కరించింది. అర్హులైన పేదలకు సొంతింటి స్థలం కేటాయించాలంటే కనీసం 15,485 ఎకరాలు అవసరం అని అధికారులు నిర్ధారణకు వచ్చారు. అయితే ప్రభుత్వం వద్ద అంత భూమి లేదు. 4,828.59 ఎకరాలే ఉన్నాయి. ఏ జిల్లాల్లోనూ సరిగ్గా 1500ఎకరాలు కూడా లేవు. గరిష్ఠంగా గుంటూరులో 1118 ఎకరాలు ఉంటే, కనిష్ఠంగా శ్రీకాకుళంలో 58 ఎకరాలే ఉన్నాయి.
 
దీంతో గ్రామీణ, పట్టణప్రాంతాల్లో ప్రభుత్వ భూముల ఆధారంగా 1.70 లక్షల మందికే ఇళ్లస్థలాలు ఇవ్వవొచ్చని తేల్చారు. మరి మిగిలిన 5.30 లక్షల మంది మాటేమిటి? దీనికి ఉన్న ఏకైక మార్గం ప్రైవేటుగా భూములు కొనుగోలు చేయడమే. కనీసం 12,481 ఎకరాల భూమిని కొనుగోలు చేయాల్సి ఉంటుందని రెవెన్యూశాఖ అంచనా వేస్తోంది. ప్రభుత్వ భూమితోపాటు కొనుగోలు చేసే ప్రైవేటు భూమిని ఇళ్లస్థలాల కోసం సిద్ధం చేయడానికి అదనపు ఖర్చు కానుంది. మొత్తం ప్రైవేటు భూమి సేకరించడానికి రూ.6వేల కోట్లు ఖర్చుకానుందని అధికారులు అంచనావేశారు. ప్రస్తుతమున్న ఆర్థిక ఇబ్బందుల్లో హౌసింగ్‌కు అవసరమైన భూసేకరణకు రూ.6వేల కోట్లు వ్యయం చేయడం సాధ్యమవుతుందా? అన్న చర్చ జరుగుతోంది. అయితే, హౌసింగ్‌ అనేది ప్రాధాన్య కార్యక్రమం కాబట్టి దశలవారీగా దీనిని అమలు చేస్తే నిధులు సమకూర్చుకోవడం పెద్ద భారం కాదని అధికారవర్గాలు చెబుతున్నాయి.