నూతన మంత్రి వర్గాన్ని రేపు ప్రకటించనున్న జగన్‌

Published: Thursday June 06, 2019
మంత్రి వర్గంలో ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ళ నాని, భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌, కొవ్వూరు ఎమ్మెల్యే తానేటి వనిత, నరసాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఎన్నికల ముందు ఏలూరు నుంచి కొత్త ముఖాన్ని రంగంలోకి దింపి నెగ్గించుకు రావాలని భావించారు. మారుతున్న రాజకీయ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని ఎమ్మెల్సీగా వ్యవహరిస్తున్న ఆళ్ళ నానిని ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దింపారు. à°ˆ పరిణామాలు అప్పట్లో ఏలూరులో సంచలనం సృష్టించాయి. పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని, నానిని మంత్రి వర్గంలోకి తీసుకునే క్రమంలోనే ముందస్తుగా ఎమ్మెల్యేగా బరిలోకి దింపారని కొందరు ప్రచారం చేశారు. దీనికి తగ్గట్టుగానే ఆయన కూడా పూర్తి ధీమాతో ఉన్నారు. ‘ఏలూరు నుంచి పోటీ చెయ్యి.. కేబినెట్‌లో నా దగ్గర నువ్వు ఉండాలి’ అని ఎన్నికలకు ముందు నానిని ఉద్దేశించి జగన్‌ అన్నారు. ఇప్పుడు దీనిని ఉదహరిస్తున్నారు. పార్టీకి మొదటి నుంచి అండదండగా ఉండడం, జిల్లా అధ్యక్ష బాధ్యతను సమర్ధవంతంగా పోషించడం, విభేదాలు లేకుండా సర్దుబాటు చేయడం, కొందరు కావాలనే రెచ్చగొట్టినా సంయమనంతో వ్యవహరించడం నానికి కలిసి వచ్చింది. ఇదే క్రమంలో మంత్రి వర్గంలో ఆయనకు బెర్త్‌ ఖాయమని సంకేతాలు అందుతున్నాయి.
 
 à°­à±€à°®à°µà°°à°‚లో పవన్‌కల్యాణ్‌ను à°“à°¡à°¿à°‚à°šà°¿ విజయాన్ని మూట కట్టుకున్న గ్రంధి శ్రీనివాస్‌ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. భీమవరం నుంచి పోటీ చేసే అభ్యర్థిగా శ్రీనివాస్‌à°—à°¾ పాదయాత్రలో జగన్‌ తొలి ప్రకటన చేశారు. మొదటి నుంచి ఆయనతోవున్న అటాచ్‌మెంట్‌ను దృష్టిలో పెట్టుకుని à°ˆ ప్రకటన చేసినట్టు చెబుతున్నారు. అయితే నాని, శ్రీనివాస్‌ ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో.. ఇద్దరికీ ఉంటుందా ? లేదా ఒకరికే ఛాన్స్‌ ఇస్తారా అనేది తేలాల్సి ఉంది.
 
కొవ్వూరు ఎమ్మెల్యే తానేటి వనిత పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. ఇంతకు ముందు టీడీపీ హయాంలో మహిళా ఎమ్మెల్యేగా పీతల సుజాతకు అవకాశం ఇచ్చారు. ఇదే ధోరణితో ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం నుంచి ఎన్నికైన వనితకు ఛాన్స్‌ ఖాయమని వినిపిస్తోంది. ఇప్పటికే కొందరు ఆమెను కలిసి అభినందనలు తెలియచేస్తున్నారు. కార్యకర్తలైతే పట్టరాని ఉత్సాహంతో ఉన్నారు.
 
 à°‡à°¦à±‡ తరుణంలో గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు పేరు తాజాగా వినపడుతుంది. అసలు à°ˆ నియోజకవర్గం నుంచి వెంకట్రావును మార్చి వేరే వారికి అవకాశం ఇవ్వాలని పార్టీలో కొందరు కోరినట్టు.. అప్ప ట్లోనే జగన్‌ దీనిని పూర్తిగా వ్యతిరేకించారు. వెంకట్రావుకు సంపూర్ణ మద్దతు ఇచ్చారు. ఇటీవల వైసీపీ కేంద్ర కార్యాలయంలో వెంకట్రావుకు అనుకూలంగా కొందరు సీఎం జగన్‌ వద్ద సంభాషించినట్టు చెబుతున్నారు. ఇది వర్క్‌ అవుట్‌ అయితే వనితకు బదులుగా వెంకట్రావుకు ఛాన్స్‌ ఇచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.