డోర్‌ డెలివరీ ద్వారా రేషన్‌ ఇంటింటికీ

Published: Tuesday June 11, 2019
రేషన్‌ షాపుల ద్వారా సన్నబియ్యం సరఫరా చేయాలని కేబినెట్‌ నిర్ణయించింది. సెప్టెంబర్‌ 1à°µ తేదీ నుంచి à°ˆ విధానం అమలు చేయాలని నిశ్చయించారు. అలాగే, అర్హులు రేషన్‌ షాపుల వద్ద బారులు తీరే అవసరం లేకుండా, గ్రామవలంటీర్ల ద్వారా ఇంటింటికీ రేషన్‌ డోర్‌ డెలివరీ చేయించనున్నారు. 5 కేజీలు, 10 కేజీలు, 15 కేజీల బ్యాగుల ద్వారా రేషన్‌ బియ్యం సరఫరా చేస్తామని, బియ్యంతోపాటు ఐదారు రకాల నిత్యావసర సరుకులు కూడా అందజేస్తామని సమాచార శాఖ మంత్రి పేర్ని నాని మీడియాకు వివరించారు. సోమవారం సచివాలయంలో జరిగిన కేబినెట్‌ సమావేశం అనంతరం పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ... అగ్రిగోల్డ్‌ బాధితుల కోసం కోర్టులో రూ.1150 కోట్లు డిపాజిట్‌ చేయాలని నిర్ణయించినట్టు నాని చెప్పారు. రూ.20,000 లోపు పరిహారం చెల్లించాల్సిన బాధితులకు కోర్టు అనుమతితో à°ˆ నిధులతో మొదటి దశలో చెల్లిస్తామన్నారు. అగ్రిగోల్డ్‌ పేరున ఉన్న ఖరీదైన ఆస్తులను కోర్టు అనుమతితో విక్రయించి బాధితుల బాకీలు తీర్చాలని నిర్ణయించినట్టు పేర్కొన్నారు.
రాష్ట్రంలో ఉన్న 40,000 ప్రభుత్వ పాఠశాలల్లో పూర్తిస్థాయిలో మౌలికసదుపాయాలు కల్పించాలని నిర్ణయించినట్టు పేర్ని నాని చెప్పారు. ‘‘ప్రస్తుతం à°† పాఠశాలల ఫోటోలు తీస్తాం. మౌలికసదుపాయాల కల్పన పూర్తయ్యాక కూడా à°† పాఠశాలల ఫొటోలు తీస్తాం. అప్పటికీ, ఇప్పటికీ జరిగిన మార్పులను ప్రపంచానికి చూపిస్తాం’’ అని వివరించారు. మధ్యాహ్నభోజన పథకాన్ని మరింత బలోపేతం చేయాలని నిర్ణయించినట్టు మంత్రి చెప్పారు. ప్రతి 40 కిలోమీటర్ల పరిధిలో ఉన్న పాఠశాలలకు కలిపి సెంట్రలైజ్డ్‌ కిచెన్‌ ఏర్పాటు చేసి, పోషకాహారం, రుచి, శుచికరమైన భోజనం అందజేస్తామని చెప్పారు. వండిన ఆహారాన్ని పిల్లలకు వడ్డించే పనిని ఆయాలకు అప్పగిస్తామని, ఇందుకు గాను నెలకు వారికి రూ.3,000 గౌరవ వేతనం అందజేస్తామని చెప్పారు.