రాష్ట్రంలో 55% తక్కువ వర్షపాతం

Published: Monday June 17, 2019
ఏరువాక పున్నమి.. రైతుల పండగ. పొలాలనన్నీ దుక్కిదున్ని వ్యవసాయ పనులకు శ్రీకారం చుట్టే రోజు. పాటలతో కోలాహలంగా సాగాల్సిన సందర్భం. కానీ, à°ˆ ఏడాది పరిస్థితి భిన్నంగా ఉంది. జూన్‌ మూడో వారం వచ్చినా రాష్ట్రంపై వరుణుడు కరుణ చూపలేదు. సోమవారం ఏరువాక పౌర్ణమి అయినా రైతుల కళ్లలో à°† కాంతి లేదు. పూర్తిగా తొలకరి పలకరింపునకే నోచుకోని రైతన్న... దీనంగా ఆకాశం వైపు చూస్తున్నాడు. వెరసి.. ఏరువాక à°•à°³ తప్పింది. ఇప్పటికీ రాష్ట్రంలోకి ప్రవేశించని రుతుపవనాలు... వచ్చినా రాష్ట్రవ్యాప్తంగా విస్తరించడానికి అదనంగా మరో వారం సమయం పడుతుంది. అనంతరం నేల పదునయ్యేంత వర్షం కురిస్తే తప్ప విత్తనాలు నాటే పరిస్థితి ఉండదు. మొత్తంగా వర్షాల ఆలస్యం వల్ల సుమారు మూడు వారాల పంటకాలాన్ని నష్టపోయామని, ఖరీఫ్ పై ఇది తీవ్ర ప్రభావమే చూపుతుందని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.
 
రాష్ట్రంలో సాధారణంగా జూన్‌ రెండో వారంలో తొలకరి కురుస్తుంది. కానీ à°ˆ ఏడాది ఇంత వరకూ రుతు పవనాలు పూర్తిగా రాష్ట్రాన్నే తాకలేదు. మృగశిర కార్తె సగానికి వచ్చినా రోహిణీ కార్తెను తలపించేలా ఎండలు మండిపోతున్నాయి. అక్కడక్కడా చెదురుమదురుగా చినుకులు రాలినా, దుక్కులు దున్నితే మట్టిగడ్డ విరగని పరిస్థితి. వర్షాలతో వాతావరణం చల్లబడి, పొలాల్లో ఏరువాక పనులు చేయాల్సిన సమయంలో తీవ్రమైన వడగాడ్పులు వీస్తున్నాయి. పలుచోట్ల వ్యవసాయ బోర్లు అడుగంటిపోయాయి. దీంతో, రైతులు పొలాల వైపు చూడడంలేదు. à°ˆ ఏడాది నైరుతి సీజన్‌లో సాధారణ వర్షపాతం కురుస్తుందని చెప్పిన వాతావరణ శాఖ... జూన్‌లో మాత్రం సాఽధారణం కంటే తక్కువే నమోదవుతుందని వెల్లడించింది. అయితే మరీ తీవ్ర దుర్భిక్షం నెలకొనడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
 
రాష్ట్రంలో భూగర్భ జలాలు పాతాళానికి పడిపోయాయి. జూన్‌ 1 నుంచి 16 వరకూ రాష్ట్రంలో 55శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. à°—à°¡à°šà°¿à°¨ పక్షం రోజుల్లో కురిసిన వర్షం రుతుపవన ముందస్తు వర్షాలే అయినా à°ˆ సమయానికి రాష్ట్రాన్ని తాకాల్సిన నైరుతి రుతుపవనాల జాడ కనిపించడంలేదు. జూన్‌ à°’à°•à°Ÿà°¿ నుంచి 16 వరకూ రాష్ట్రంలో(యానాంతో కలిపి) 49 మిల్లీమీటర్లకుగాను 22 మిల్లీమీటర్ల వర్షం (55శాతం లోటు) కురిసింది. కోస్తాలో 52 మిల్లీమీటర్లకుగాను 15.2 (71శాతం లోటు), రాయలసీమలో 44.8 మిల్లీమీటర్లకుగాను 31.4 మిల్లీమీటర్లు (30 శాతం లోటు) వర్షపాతం నమోదైంది. కోస్తాతో పోల్చితే రాయలసీమలో కొంతమేర ఫర్వాలేదనిపించేలా వర్షాలు కురిశాయి. అనంతపురం జిల్లాలో సాధారణం కంటే రెండుశాతం ఎక్కువగా నమోదుకాగా మిగిలిన మూడు జిల్లాల్లో 30 నుంచి 50 శాతం తక్కువగా వర్షపాతం నమోదైంది. కోస్తాలో మాత్రం పలుజిల్లాల్లో తీవ్ర దుర్భిక్షం నెలకొంది. తాగునీటికి సైతం ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కృష్ణాజిల్లాలో 84, నెల్లూరులో 82, ప్రకాశం, పశ్చిమగోదావరి జిల్లాల్లో 81, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో 67, తూర్పుగోదావరిలో 65, విశాఖపట్నంలో 63 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలోని రిజర్వాయర్లలో నీటిమట్టాలు కూడా కనిష్ఠస్థాయికి పడిపోయాయి. నదులు, చెరువులు, వాగులు జలకళ తప్పడంతో రాష్ట్రం నీటిఎద్దడిని ఎదుర్కొంటోంది.