వివేకా హత్య కేసు నిందితులకు నో బెయిల్‌.....

Published: Friday June 21, 2019
మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితులైన ఇద్దరి బెయిల్‌ అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది. పిటిషన్‌ను డిస్మిస్‌ చేసేందుకు న్యాయమూర్తి సిద్ధం కాగా.. పిటిషన్‌ను ఉపసంహరించుకుంటానని పిటిషనర్ల తరఫు న్యాయవాది చెప్పడంతో కోర్టు అంగీకరించింది. à°ˆ ఏడాది మార్చి 15à°¨ à°•à°¡à°ª జిల్లా పులివెందులలోని తన స్వగృహంలో వివేకా హత్యకు గురైన విషయం తెలిసిందే. à°ˆ కేసుకు సంబంధించి పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. వారిలో ఏ2à°—à°¾ ఉన్న ములి వెంకట కృష్ణారెడ్డి, ఏ3à°—à°¾ ఉన్న ఎద్దుల ప్రకాశ్‌ బెయిల్‌ కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. వారి పిటిషన్‌ను న్యాయమూర్తి జస్టిస్‌ డీవీఎ్‌సఎస్‌ సోమయాజులు గురువారం విచారించారు. à°ˆ సందర్భంగా పిటిషనర్ల తరఫు న్యాయవాది వీఆర్‌ రెడ్డి కోవూరి వాదనలు వినిపిస్తూ.. ‘రాష్ట్రంలో ఎన్నికలకు ముందు ముఖ్యమైన నేత హత్య జరగడంతో à°† ప్రభావం అధికార పార్టీపై పడుతుందన్న ఉద్దేశంతో పోలీసులు హడావుడిగా వ్యవహరించారు. చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పేందుకే వెంకట కృష్ణారెడ్డి, ప్రకాశ్‌లను అరెస్టు చేశారు.
 
à°ˆ కేసుకు సంబంధించి పోలీసులు ఇప్పటి వరకూ ఎలాంటి సాక్ష్యాలు సేకరించలేకపోయారు. అన్యాయంగా పిటిషనర్లను అరెస్టు చేశారు. ఇప్పటికే నిందితులిద్దరూ 60 రోజులకుపైగా జైలులో ఉన్నారు. బెయిల్‌ పొందేందుకు వారు అన్నివిధాలా అర్హులు’ అని పేర్కొన్నారు. పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపిస్తూ.. ‘వివేకా హత్య అనంతరం నిందితులిద్దరూ సాక్ష్యాలను రూపుమాపేందుకు ప్రయత్నించారు.