పనులు ఆపేస్తూ సీఎస్‌ ఉత్తర్వులు .... మినహాయింపు కోసం అధికారుల వినతి

Published: Saturday June 22, 2019
 à°—్రామీణ, మండల ప్రాంతాలకు రహదారి సదుపాయాలను కల్పించే కీలక ప్రాజెక్టులను కొనసాగించాలని సర్కారును కోరేందుకు ఆర్‌అండ్‌బీ సిద్ధమైంది. జాతీయ, అంతర్జాతీయ బ్యాంకులు, కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాల à°•à°¿à°‚à°¦ చేపట్టే వాటిని నిలిపివేయడంవల్ల మౌలిక సదుపాయాల కల్పనా à°°à°‚à°—à°‚ కుదేలవుతుందని ఆశాఖ భావిస్తోంది. à°ˆ నేపథ్యంలో మూడురకాల ఆర్‌అండ్‌బీ ప్రాజెక్టులను తిరిగి చేపట్టేందుకు అనుమతించాలని ప్రభుత్వాన్ని కోరనుంది. తొలుత ఇదే విషయమై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యంతో భేటీ అయి చర్చించాలని అధికారులు నిర్ణయించారు. అయితే రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆర్థిక ఇబ్బందులను అధిగమించేందుకు చేపట్టిన చర్యల్లో భాగంగా.. ఏప్రిల్‌ 1à°•à°¿ ముందు మంజూరైన పనులు, టెండర్ల దశలో ఉన్నవి, వర్క్‌లు మంజూరై కేవలం 25శాతంలోపే పనులు పూర్తిచేసిన వాటిని నిలిపివేయాలంటూ సీఎస్‌ మే 29à°¨ అన్ని శాఖలను ఆదేశించారు. à°ˆ ఉత్తర్వుల కారణంగా రోడ్లు భవనాల శాఖలో రూ.15,939 కోట్ల విలువైన ప్రాజెక్టులు నిలిచిపోయాయి. ఆర్‌అండ్‌బీ ముఖ్యకార్యదర్శిగా à°Žà°‚à°Ÿà±€ కృష్ణబాబు బాధ్యతలు చేపట్టిన తర్వాత à°ˆ వర్క్‌à°² తీరుతెన్నులను సమీక్షించారు.
 
నిలిచిపోయే ప్రాజెక్టుల జాబితాను పున:పరిశీలన చేశారు. వీటిల్లో గ్రామాల నుంచి మండలాలు, అక్కడి నుంచి జిల్లా కేంద్రాలకు రహదారుల నిర్మించే రెండు రకాల కనెక్టివ్‌ ప్రాజెక్టులు, కేంద్ర ప్రభుత్వం నుంచి సీఆర్‌ఎఫ్‌ à°•à°¿à°‚à°¦ వచ్చే రూ.848 కోట్ల విలువైన వర్క్‌లు, ఆంధ్రప్రదే శ్‌ రోడ్డు అభివృద్ధి సంస్థ (ఏపీఆర్డీసీ) చేపట్టే పనులు ఉన్నాయి. ఇవన్నీ చాలా కీలకమైనవిగా ఆర్‌అండ్‌బీ భావిస్తోంది. à°ˆ పనుల పూర్తికి కేంద్ర ప్రభుత్వ హామీతోనే న్యూ డెవల్‌పమెంట్‌ బ్యాంకు(ఎన్‌డీబీ) రూ.6,400 కోట్ల రుణం ఇచ్చేందుకు ముందుకొచ్చింది. à°ˆ ప్రాజెక్టులో రుణ భారమంతా కేంద్రమే భరిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం తన వాటా à°•à°¿à°‚à°¦ కేవలం రూ.300 కోట్లు మాత్రమే భరించాల్సి ఉంటుంది. ఇది ఖజానాపై పెనుభారం వేయదని, పైగా కేంద్ర సంస్థలు ఆమోదించిన ప్రాజెక్టును నిలిపివేయడం కూడా సరికాదని అధికారులు పేర్కొంటున్నారు. అందుకే ఎన్‌డీబీ రుణంతో చేపట్టే à°ˆ ప్రాజెక్టులను సీఎస్‌ ఇచ్చిన ఆదేశాల నుంచి మినహాయించాలని ఆర్‌అండ్‌బీ కోరబోతోంది. దీనిపై సీఎ్‌సకు నివేదించేలా à°’à°• రిపోర్టును సిద్ధం చేశారు. త్వరలో సీఎస్‌ వద్ద ఉన్నతస్థాయి సమావేశం జరగనుందని ఆర్‌అండ్‌బీ ఇంజనీరింగ్‌ వర్గాల ద్వారా తెలిసింది. మినహాయింపు కోరనున్న ప్రాజెక్టుల విలువ రూ.12,743 కోట్లమేర ఉండనుందని అధికారవర్గాలు తెలిపాయి.