చంద్రబాబు నివాసానికి నోటీసులు

Published: Friday June 28, 2019
 à°‰à°‚డవల్లిలోని ప్రజావేదికను నిబంధనలను తుంగలో తొక్కి అక్రమంగా, అవినీతిగా నిర్మించారంటూ దాన్ని కూల్చివేయాలంటూ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇప్పటికే à°† భవనాన్ని సీఆర్డీఏ అధికారులు కూల్చివేయడం జరిగింది. అక్రమ కట్టడాలపై వైఎస్ జగన్ దృష్టిసారించారు. అయితే à°† అక్రమ కట్టడాల జాబితాలో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసం ఉంటున్న భవనం కూడా ఉన్నట్లు తేలింది. దీంతో చంద్రబాబుకు నోటీసులు జారీ చేసేందుకు కరకట్టలోని ఆయన నివాసానికి సీఆర్డీఏ అధికారులు చేరుకున్నారు.
నోటీసులు జారీ చేసేందుకు సీఆర్డీఏ అసిస్టెంట్ డైరెక్టర్ నరేందర్ రెడ్డి.. బాబు నివాసానికి కాసేపటి క్రితం చేరుకుని నోటీసులు ఇచ్చారు. ఇళ్లు ఖాళీ చేయించి పడగొట్టాలని లేనిపక్షంలో ప్రభుత్వమే కూల్చివేస్తుందని నోటీసుల్లో అధికారులు పేర్కొన్నట్లు సమాచారం. వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని సీఆర్డీఏ అధికారులు ఆదేశించారు. నోటీసులకు వివరణ ఇవ్వకపోతే భవనాలు తొలగిస్తామని అధికారులు స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే ప్రముఖ పారిశ్రామికవేత్త లింగమనేని రమేష్ అతిథి గృహాన్ని.. 2014లో టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన అనంతరం తన నివాసం మార్చుకుని.. జడ్ ప్లస్ కేటగిరి భద్రతకు అనుకూలంగా మార్పులు చేర్పులు చేసిన సంగతి తెలిసిందే.
 
 à°¶à±à°•à±à°°à°µà°¾à°°à°‚ ఉదయం నుంచి కరకట్టపై అక్రమంగా భనాలు నిర్మించిన వారికి సీఆర్డీఏ అధికారులు నోటీసులు ఇస్తున్నారు. కృష్ణానది పరివాహక ప్రాంతం.. కరకట్టకు మధ్యలో నిర్మించిన అనేక అక్రమ కట్టడాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. దీంతో గురువారం సాయంత్రం నుంచి కట్టడాల ఎప్పుడు నిర్మించారు..? ఎన్నిరోజులు అనుమతి ఉంది..? కోర్టు పరిధిలో వివాదాలు ఉన్నాయా..? అనే అంశంపై నిశితంగా చర్చించి నోటీసులు పర్వం ప్రారంభించారు. మొత్తం 50 కట్టడాలు అక్రమంగా నిర్మించినట్లు అధికారులు గుర్తించారని ఇవాళ నోటీసులు జారీ చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి.