కొత్త పెట్టుబడులు తేకపోగా ఉన్నవి చెడగొడుతున్న ప్రభుత్వం

Published: Friday June 28, 2019
విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలపై (పీపీఏ)లపై సమీక్ష పేరిట చేస్తున్న హడావుడి వసూళ్ల కోసమేనని విపక్ష తెలుగుదేశం ఆరోపించింది. అప్పట్లో అధికారంలోకి వచ్చిన వైఎస్‌ కూడా అచ్చం ఇలాగే చేశారని... పీపీఏలు సమీక్షించి ధరలు తగ్గిస్తామంటూ టీడీపీపై బురద చల్లి వసూళ్లు చేసుకున్నారని తెలిపింది. ఇప్పుడు ఆయన కుమారుడు జగన్‌ కూడా అదే బాటలో పయనిస్తున్నారని విమర్శించింది. గురువారం టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నివాసంలో à°† పార్టీ నేతల సమావేశం జరిగింది. ‘‘టీడీపీ ప్రభుత్వంపై బురద చల్లడమే పనిగా వ్యవహరిస్తున్నారు. వారు చేసే ప్రతి ఆరోపణకూ సమాధానం ఇవ్వాలి’’ అని చంద్రబాబు ఆదేశించారు. జగన్‌ ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధిని గాలికి వదిలేసి... రాజకీయ కక్ష సాధింపు పైనే దృష్టి పెట్టిందన్నారు. ‘‘à°—à°¤ ఐదేళ్లలో మనం పారదర్శక పాలన అందించాం. జాతీయంగా, అంతర్జాతీయంగా రాష్ట్ర ప్రతిష్ఠ పెంచాం. కొత్త ప్రభుత్వం దానికి కొనసాగింపుగా పెట్టుబడులు తేవడం, పరిశ్రమలు స్థాపించడం, యువతకు ఉపాధిని కల్పించకపోవడంపై దృష్టి పెట్టకపోవడం బాధాకరం’’ అని అన్నారు.
 
పీపీఏలను సమీక్షిస్తామంటూ జగన్‌ చేసిన ప్రకటన à°ˆ సమావేశంలో చర్చకు వచ్చింది. ‘‘వైఎస్‌ ముఖ్యమంత్రిగా ఉండగా విద్యుత్‌ శాఖ అనేక కుంభకోణాలకు నిలయంగా మారింది. అవేవీ ప్రజలకు గుర్తు లేవనుకొని ఇప్పుడు టీడీపీపై జగన్‌ ఆరోపణలు చేస్తున్నారు. యూనిట్‌ కరెంటు రూ.7కు లభిస్తున్న సమయంలో వైఎస్‌ 14 రూపాయలు పెట్టి కొన్నారు. ఏపీ జెన్‌కోను తీవ్ర నష్టాల్లోకి నెట్టారు. జెన్‌కోను అడ్డు పెట్టుకొని సొంత కుటుంబ సభ్యులతో హిమాచల్‌ప్రదేశ్‌, సిక్కిం, కర్ణాటక, ఛత్తీ్‌సగఢ్‌ రాష్ట్రాల్లో రూ.50 వేల కోట్ల విలువైన పవర్‌ ప్లాంట్లు ఏర్పాటు చేశారు. వైఎస్‌ కుటుంబానికి చెందిన సరస్వతి పవర్‌, సండూర్‌ పవర్‌, ఎథెనా తీస్తా వంటి పవర్‌ ప్లాంట్లలో యూనిట్‌ విద్యుత్‌ ధర à°Žà°‚à°¤? పీపీఏలు ఏ ధరకు కుదుర్చుకొన్నారు? అవినీతి డబ్బుతో అనేక రాష్ట్రాల్లో పవర్‌ ప్లాంట్లు నెలకొల్పిన వ్యక్తి ఇప్పుడు పీపీఏల గురించి మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంది’’ అని à°’à°• మాజీ మంత్రి ఆరోపించారు. పీపీఏలపై సమీక్షలు వద్దని, అలాగైతే పెట్టుబడులు రావని కేంద్ర ఇంధన శాఖ కార్యదర్శి లేఖ రాసినా జగన్‌ పట్టించుకోవడంలేదని... తన హయాంలో కొత్త పెట్టుబడులు తెచ్చే పనిపై శ్రద్ధ పెట్టకుండా వచ్చిన పెట్టుబడులను కూడా పోగొడుతున్నారని ఆయన విమర్శించారు.