జనసేనను బలోపేతం చేసేందుకు పవన్‌ కల్యాణ్‌ కీలక నిర్ణయం

Published: Wednesday July 03, 2019
జనసేనను క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు à°† పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ తరపున నరసాపురం లోక్‌సభ అభ్యర్థిగా పోటీ చేసిన తన చిన్నన్న నాగబాబుకు కీలక బాధ్యతలు అప్పగించనున్నారు. పార్టీలో సమన్వయ కమిటీని ఏర్పాటు చేసి.. దాని సారథ్య బాధ్యతలను ఆయనకు కట్టబెట్టాలని నిర్ణయించారు. శ్రేణులకు, నాయకులకు మధ్య సమన్వయం లేదని పవన్‌ గుర్తించారు. మరోవైపు.. పార్టీని ముందుకు తీసుకెళ్లే క్రమంలో తాను కేడర్‌తో కలిసేందుకు చాలా ఇబ్బందులు వస్తున్నాయని.. తనకున్న ఫాలోయింగ్‌ దృష్ట్యా క్షేత్రస్థాయి నాయకులను కలిసేందుకు వీలు కుదరడం లేదని ఆయన గ్రహించారు. తనకు, కేడర్‌కు మధ్య సమన్వయం చేసేందుకు కమిటీని ఏర్పాటు చేస్తామని ఇదివరకే ప్రకటించారు. ప్రస్తుతం పవన్‌ స్థాయిలో ఫాలోయింగ్‌ ఉన్న నేతలెవరూ పార్టీలో లేరు. à°ˆ పరిస్థితుల్లో సమన్వయ బాధ్యతను నాగబాబుకు అప్పగిస్తే బాగుంటుందని ఆయన భావిస్తున్నారు. అమెరికాలో జరిగే తానా సభల నుంచి రెండో వారంలో తిరిగొచ్చాక పార్లమెంటు నియోజకవర్గాల వారీగా పర్యటనలు తలపెట్టారు. à°† పర్యటనలకు శ్రీకారం చుట్టే ముందే సమన్వయ కమిటీ బాధ్యతలను నాగబాబు అప్పగించాలని భావిస్తున్నారు.
 
మెగాస్టార్‌ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో కూడా నాగబాబు కీలక బాధ్యతలు నిర్వహించారు. కేడర్‌కు ఆయన చాలా దగ్గరగా ఉండేవారు. వారిని అప్పటికప్పుడు సమన్వయపరిచేవారు. కింది స్థాయి నేతలతో తరచూ సమావేశాలు ఏర్పాటు చేసేవారు. పార్టీ ఎక్కడ బలహీనంగా ఉంది.. అక్కడ ఎలాంటి నాయకులు ఉంటే మంచిదో ఎప్పటికప్పుడు చిరంజీవికి వివరించేవారు. à°† అనుభవంతో జనసేనలో కూడా పార్టీ శ్రేణుల బాధ్యతను ఆయనకే అప్పగించాలని పవన్‌ నిర్ణయించినట్లు సమాచారం.