పొలాల్లో ఉండాల్సినవారిని రోడ్డెక్కించారు

Published: Tuesday July 09, 2019
వ్యవసాయ సీజన్లో రైతులకు సవ్యంగా విత్తనాలే ఇవ్వలేని ప్రభుత్వం.. రైతు దినోత్సవాలు జరపడం హాస్యాస్పదమని టీడీపీ వ్యాఖ్యానించింది. పొలాల్లో ఉండాల్సిన రైతులు విత్తనాల కోసం రోడ్లెక్కాల్సిన పరిస్థితి తెచ్చారని, లాఠీచార్జి జరిపించడం.. పోలీసు స్టేషన్లలో విత్తనాల పంపిణీ రోజులు మళ్లీ తెచ్చారని విమర్శించింది. మాజీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ నేతలు సోమవారం గుంటూరులోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో భేటీ అయ్యారు. à°ˆ సందర్భంగా రైతు దినోత్సవం కార్యక్రమం ప్రస్తావనకు వచ్చింది. ‘రాజన్న రాజ్యం తెస్తామనే పేరుతో రైతు వ్యతిరేక రాజ్యం తెచ్చారు. విత్తనాల కోసం రైతుల ధర్నాలు జరగకుండా రాయలసీమ, ఉత్తరాంధ్రలో రో జు గడవడం లేదు. పోలవరం పనులు ఆలస్యం చేసిందే నాటి సీఎం రాజశేఖరరెడ్డి. దానిని కప్పిపెట్టి à°† ప్రాజెక్టు పనులపై జగన్‌ ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తోంది. టెండర్లు ఖరారై పనులు జరుగుతున్న సమయంలో రాజశేఖరరెడ్డి జోక్యం చేసుకుని à°† టెండర్లను కావాలని రద్దు చేయించారు. దాంతో పనులు ఆగిపోయాయి. టీడీపీ హయాంలో నాలుగేళ్లలో 70% పనులు పూర్తయ్యాయి. పనులు ఆపేసిన వాళ్లను పొగిడి.. వేగంగా చేసిన మమ్మల్ని ప్రభుత్వ పెద్దలు విమర్శిస్తున్నారు’ అని à°“ నాయకుడు ఆక్షేపించారు. పోలవరం పనుల్లో అవినీతిని వెతకాలని అధికారులను బతిమాలుతున్నారని, లోపాలు చెబితే సన్మానాలు చేస్తామని, రివార్డులిస్తామంటున్నారని ఎద్దేవాచేశారు.
 
 
 
చంద్రబాబు కూడా మాట్లాడుతూ.. ‘మనం ఏది చేసినా ప్రజా ప్రయోజనం కోసం చేశాం. ప్రాజెక్టు నిర్మాణంలో క్లిష్టమైన పనులన్నీ మనం చేసేశాం. ఇప్పుడు మిగిలిన పనులు à°…à°‚à°¤ క్లిష్టమైనవి కావు. అందుకే ఏడాదిలో వాటిని పూర్తి చేయగలమ ని చెప్పాను. కానీ మూడేళ్లు పడుతుందని వీళ్లు అంటున్నారు’ అని వ్యాఖ్యానించారు. ప్రజలు అత్యధిక సంఖ్యలో ఎంపీలను గెలిపించినా వారి ద్వారా కేంద్రం నుంచి పెండింగ్‌ నిధులు రాబట్టే ప్రయత్నమేదీ జరగడం లేదని మాజీ ఎమ్మెల్యే ఒకరు విమర్శించారు.
 
 
2014లో టీడీపీ అధికారంలోకి వచ్చినప్పుడు 22 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ కొరత ఉందని, కానీ రెండు నెలల్లోనే దానిని అధిగమించి రాష్ట్రాన్ని మిగులు విద్యుత్‌ దిశగా నడిపిందని నేతలు చెప్పారు. కానీ, వైసీపీ ప్రభుత్వం వచ్చిన నెల రోజుల్లోనే రాష్ట్రాన్ని కరెంటు కోతల పాల్జేశారని విమర్శించారు. వైఎస్‌ హయాంలో నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లు ఏ సౌకర్యాలూ లేకుండా పిచ్చిక గూళ్లలా కట్టారని.. ఇప్పుడు మెరుగైన సౌకర్యాలతో నిర్మిస్తుంటే డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టారని ఆరోపణలు చేస్తున్నారని, టీడీపీ హయాంలో నిర్మించిన ఇళ్లు చూసొద్దామా అని ఆయన సవాల్‌ విసిరారు.