రాష్ట్రపతి పాలన తీసుకురావాలనే ఎత్తుగడ

Published: Wednesday July 10, 2019
కాంగ్రెస్‌ - జేడీఎస్‌ సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వాములైన 14 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో ప్రభుత్వం గందరగోళ స్థితికి చేరింది. ఇక సర్కార్‌ను కాపాడుకునేందుకు సంకీర్ణ పార్టీలు ఎత్తుకు పై ఎత్తులు వేస్తుండగా శాసనసభ స్పీకర్‌ కూడా à°† దిశగానే నిబంధనలు కోరుతున్నారు. రాజీనామాలు ఆమోదిస్తే, సంకీర్ణ పార్టీల బలం 104కు పడిపోనుంది. ఇలా శాసనసభలో బలం లేని ప్రభుత్వాన్ని కొనసాగించేందుకు వీలు లేదనే డిమాండ్‌తో రాష్ట్రపతి పాలన తీసుకురావాలనే ఎత్తుగడ సాగుతున్నట్టు తెలుస్తోంది.
 
సభలో 224 మంది శాసనసభ్యులు ఉండగా కాంగ్రెస్‌ 78, జేడీఎస్‌ 37, ఇరువురు స్వతంత్రులు, à°’à°• బీఎస్పీ ఎమ్మెల్యేతో కలసి 118 మంది బలంతో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటైంది. వీరికి స్పీకర్‌ బలం కూడా ఉంటుంది. ప్రస్తుతం కాంగ్రెస్‌, జేడీఎస్‌లకు చెందిన 14మంది రాజీనామాలు, ఇరువురు స్వతంత్రుల మద్దతు ఉపసంహరణతో మెజారిటీ కుప్పకూలింది. బీజేపీకి 107మంది మద్దతు ఉండడంతో శాసనసభలో ప్రభుత్వం మైనారిటీలో పడినట్టు అయ్యింది. బలం ఉండే పార్టీకి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని లేనిపక్షంలో రాష్ట్రపతి పాలన ఏర్పాటు చేయాలనే సుప్రీం తీర్పుకు అనుగుణంగా ప్రయత్నాలు సాగుతున్నాయి. రాజీనామాలు ఆమోదించనందున అటువంటి ప్రయత్నం అసాధ్యమని సంకీర్ణ పార్టీల నేతలు అభిప్రాయపడుతుండగా బీజేపీ మాత్రం అన్ని కోణాలలో ప్రయత్నాలను ముమ్మరం చేసింది.