నేడే చంద్రయాన్‌-2 ప్రయోగం

Published: Monday July 22, 2019

చంద్రయాన్‌-2 ప్రయోగానికి ఇస్రో సిద్ధమైంది. సోమవారం మధ్యాహ్నం 2.43 గంటలకు శ్రీహరికోటలోని షార్‌ నుంచి జీఎ్‌సఎల్వీ మార్క్‌3à°Žà°‚1 రాకెట్‌ ద్వారా రివ్వున జాబిల్లి వైపు దూసుకెళ్లనుంది. సాంకేతిక లోపాన్ని అధిగమించిన తర్వాత రిహార్సల్‌ కూడా విజయవంతం కావడంతో ఆదివారం సాయంత్రం 6.43 గంటలకు కౌంట్‌డౌన్‌ ప్రారంభమైంది. బాహుబలిగా పేర్కొనే జీఎస్‌ఎల్వీ మార్క్‌3à°Žà°‚1 రాకెట్‌ బరువు 640 టన్నులు. 3,877 కిలోల బరువు కలిగిన చంద్రయాన్‌-2 కంపోజిట్‌ మాడ్యూల్‌తో à°ˆ రాకెట్‌ పయనిస్తుంది. చందమామ చెంతకు వెళ్లేందుకు రాకెట్‌ సిద్ధంగా ఉన్నట్లు ఇస్రో అధికారికంగా ప్రకటించింది. వాస్తవానికి à°ˆ నెల 15à°µ తేదీన 56 నిమిషాల ముందు సాంకేతిక లోపం తలెత్తి చంద్రయాన్‌-2 ప్రయోగం ఆగిపోయిన సంగతి తెలిసిందే. à°† లోపాన్ని సరిచేసిన తర్వాత వారం రోజులకే దానిని తిరిగి ప్రయోగానికి సన్నద్ధం చేశారు. à°ˆ ప్రయోగంలో బాహుబలి రాకెట్‌ ప్రయాణం 16.31 నిమిషాలే ఉంటుంది. భూమికి 181 కిలోమీటర్ల ఎత్తుకు చేరిన తర్వాత చంద్రయాన్‌-2 మాడ్యూల్‌ను రోదసిలో వదిలి పెడుతుంది. ఇలా భూమికి 170.06 à°•à°¿.మీ. దగ్గరగా, 39.120 à°•à°¿.మీ. దూరంగా ఉండే దీర్ఘ వృత్తాకారపు భూ కక్ష్యలోకి చంద్రయాన్‌ మాడ్యూల్‌ చేరుకున్న వెంటనే కర్ణాటక బైలాలులోని ఉపగ్రహ నియంత్రణ కేంద్రం దానిని తన అధీనంలోకి తీసుకోనుంది.