డోర్‌ డెలివరీతో తడిసి మోపెడు

Published: Saturday July 27, 2019
ప్రతి పనిలో పొదుపు బాట పట్టాలని పదే పదే చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం, పౌరసరఫరాల విషయంలో మాత్రం భిన్న వైఖరి ప్రదర్శిస్తోంది. కార్డుదారులు ఎవరూ కోరకపోయినా డోర్‌ డెలివరీ వ్యవస్థకు శ్రీకారం చుట్టిన సర్కారు, సంచుల తయారీకి భారీగా నిధులు వెచ్చిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం కిలో బియ్యాన్ని రూపాయికి పంపిణీ చేస్తోంది. అంటే ఐదు కిలోల బియ్యానికి కార్డుదారు రూ.ఐదు చెల్లిస్తున్నాడు. à°† ఐదు కిలోల బియ్యాన్ని పోసే సంచి కోసం మాత్రం ప్రభుత్వం అక్షరాలా రూ.9 ఖర్చు చేస్తోంది. శ్రీకాకుళం జిల్లాలో చేపట్టిన టెండర్‌ ప్రక్రియలో à°ˆ ధరను నిర్దేశించారు. ఐదు కిలోల సంచికి రూ.9, 10 కిలోల సంచికి రూ.12, 20కిలోల సంచికి రూ.14 ధరగా నిర్ణయించారు. à°† ధరకు సంచులు సరఫరా చేసేందుకు ఉత్తరప్రదేశ్‌కు చెందిన నీల్‌కమల్‌ పాలీమర్స్‌ అనే కంపెనీతో ఒప్పందం కుదిరింది.
 
సెప్టెంబరులో ఒక్క శ్రీకాకుళం వరకే సంచుల్లో బియ్యం సరఫరా చేయనుండగా, à°† తర్వాత సంచుల్లో డోర్‌ డెలివరీ విధానాన్ని రాష్ట్రమంతా అమలుచేయనున్నారు. à°ˆ ఏడాది సంచుల తయారీ, ప్యాకింగ్‌ చేసే యంత్రాలు అన్నీ కలిపి రూ.750 కోట్లు దాకా అవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. యంత్రాల కొనుగోలు ఒకసారే అయినా ఏటా సంచుల కొనుగోలుకే తక్కువలో తక్కువ రూ.500 కోట్లు అవుతుందని అంచనా. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో బియ్యం సరఫరాకు టెండరు ఇచ్చిన పౌరసరఫరాల శాఖ, త్వరలో రాష్ట్రవ్యాప్త కాంట్రాక్టరు ఎంపికకు సన్నద్ధమవుతోంది.
 
13 జిల్లాల్లో à°’à°• కోటి 47లక్షల కార్డుదారులున్నారు. వారికి నెలకు 20కోట్ల కిలోలకు పైగా బియ్యం పంపిణీ చేయాలి. ఇప్పటివరకూ కార్డుదారులే రేషన్‌ షాపునకు వెళ్లి సరుకులు తీసుకుంటున్నారు. దీంతో రవాణా తప్ప ఇతర ఖర్చులు ప్రభుత్వంపై పడలేదు. కానీ వైసీపీ డోర్‌ డెలివరీ అని ఇచ్చిన హామీ వల్ల ఇప్పుడు అదనంగా ప్రభుత్వంపై రూ.750కోట్లు ఖర్చు పడనుంది. ఇన్ని లక్షలమందికి డోర్‌ డెలివరీ చేయాలంటే నెలకు 2.07 కోట్ల సంచులు అవసరం కానున్నాయి. అందులో ఐదు కిలోల సంచులు 74 లక్షలు, 10 కిలోల సంచులు 73 లక్షలు, 20 కిలోల సంచులు 60 లక్షలు అవసరం అవుతున్నాయి. దాని ప్రకారం ఐదు కిలోల సంచులకు రూ.6.66కోట్లు, 10కిలోల సంచులకు రూ.8.76కోట్లు, 20కిలోల సంచులకు రూ.8.4కోట్లు అవుతున్నాయి. అంటే నెలకు రూ.23.82కోట్ల చొప్పున 12 నెలలకు రూ.286.32కోట్లు అవుతుంది. ఇవి కాకుండా బఫర్‌ గోదాములకు తరలించేందుకు 50కిలోల సంచులు కూడా తయారుచేయాల్సి ఉంది. వాటితోపాటు ప్యాకింగ్‌ యంత్రాలు కొనుగోలు చేయాలి. à°† యంత్రాల నిర్వహణ, ఇతర వ్యయాలు మొత్తం కలిపితే రూ.750 కోట్లు అవుతుందని అంచనా వేసింది.