ఇంజనీరింగ్‌ విద్యార్థులకు హైకోర్టు షాక్

Published: Thursday August 01, 2019
ఇంజనీరింగ్‌ ట్యూషన్‌ ఫీజుల వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురు దెబ్బతగిలింది. 2018-19 విద్యా సంవత్సరంలో అమలు చేసిన పాత ఫీజులనే ప్రస్తుత విద్యాసంవత్సరం(2019-20)లోనూ కొనసాగించేలా ప్రభుత్వం జారీ చేసిన జీవో 38ని రాష్ట్ర హైకోర్టు బుధవారం సస్పెండ్‌ చేసింది. దీంతో ఫీజుల వ్యవహారం మళ్లీ మొదటికి వచ్చింది. పాత లెక్కల ప్రకారం పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చేసేందుకు కట్టుబడి ఉన్నట్లు సదరు జీవోలో ప్రభుత్వం పేర్కొంది.కానీ, 2019-20 నుంచి 2021-22 వరకు ఏఎఫ్‌ఆర్‌సీ(అడ్మిషన్‌ అండ్‌ ఫీజ్‌ రెగ్యులేషన్‌ కమిషన్‌) సిఫారసు చేసిన ఫీజులనే అమలు చేయాలంటూ పలు ఇంజనీరింగ్‌ కాలేజీల యాజమాన్యాలు హైకోర్టుని ఆశ్రయించాయి. దీంతో ప్రభుత్వం ఇచ్చిన జీవోను కోర్టు కొట్టివేసింది. à°ˆ మేరకు జస్టిస్‌ à°Žà°‚.గంగారావు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదిస్తూ ప్రైవేట్‌, అన్‌ ఎయిడెడ్‌ కాలేజీలు సమర్పించే ఆదాయ, వ్యయాల మేరకు ఫీజులను నిర్ణయించేది ఏఎఫ్‌ఆర్‌సీ అని, à°ˆ విషయంలో ప్రభుత్వానికి ఎలాంటి అధికారం లేదని విన్నవించారు. ఎఫ్‌ఆర్‌సీ ఇప్పటికే ఫీజులను నిర్ణయించిందని, ప్రభుత్వం ఇప్పటి వరకు నోటిఫై చేయలేదన్నారు.
 
విద్యార్థుల సంక్షేమం కోసమే రాష్ట్ర ప్రభుత్వం కొత్త చట్టం తీసుకువచ్చిందని అడ్వొకేట్‌ జనరల్‌ ఎస్‌.శ్రీరాం తెలిపారు. ప్రభుత్వం తరఫున ఆయన వాదనలు వినిపిస్తూ.. విద్యార్థులకు 70 శాతానికి పైగానే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అందుతుందన్నారు. దీనివల్ల కాలేజీలు కూడా లబ్ధి పొందుతాయని వివరించారు. ప్రభుత్వం తాత్కాలిక ప్రాతిపదికనే జీవో జారీ చేసిందని పేర్కొన్నారు. à°ˆ చట్టం ప్రకారం ఎఫ్‌ఆర్‌సీకి బదులుగా మరో కమిటీ ఫీజులను నిర్ణయిస్తుందన్నారు. అయితే à°ˆ చట్టాన్ని నోటిఫై చేయాల్సి ఉందన్నారు.
 
జీవో 38ని సస్పెండ్‌ చేస్తూ బుధవారం హైకోర్టు సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన తీర్పుపై రిట్‌ అప్పీల్‌ వేసే యోచనలో ప్రభుత్వం ఉందని తెలుస్తోంది. ఇదే జరిగితే.. à°ˆ ఫీజుల వ్యవహారం సుప్రీంకోర్టు వరకు వెళ్లే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. à°ˆ విషయమై ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ కె.హేమచంద్రారెడ్డిని వివరణ కోరగా.. హైకోర్టు తీర్పు కాపీ అందిన తర్వాత ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలన్నారు. ఇంజనీరింగ్‌ కౌన్సెలింగ్‌ ప్రక్రియ మాత్రం షెడ్యూల్‌ ప్రకారమే జరుగుతుందని చెప్పారు. మరోపక్క, ట్యూషన్‌ ఫీజులపై రానున్న రెండు రోజుల్లో స్పష్టత రాకుంటే సీట్ల కేటాయింపు డైలమాలో పడే అవకాశం ఉందని తెలుస్తోంది.
 
à°ˆ వ్యవహారం కాస్త ప్రభుత్వానికీ, కాలేజీల యాజమాన్యాలకు మధ్య న్యాయవివాదంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఫీజుల నియంత్రణ, పర్యవేక్షణకు చట్టబద్ధత కలిగిన కమిషన్‌ను ఏర్పాటు చేస్తున్నందున 2019-20 విద్యా సంవత్సరంలో పాత ట్యూషన్‌ ఫీజులనే కొనసాగిస్తామన్నది ప్రభుత్వ వాదన. అయితే, సుప్రీంకోర్టు సూచన మేరకు ఏర్పడిన ప్రస్తుత ఏఎ్‌ఫఆర్‌సీ సిఫారసు చేసిన కొత్త ఫీజులనే అమలు చేయాలని కాలేజీల యాజమాన్యాలు కోరుతున్నాయి.