కశ్మీర్‌పై ట్రంప్ కొత్తపాట

Published: Friday August 02, 2019
 à°•à°¶à±à°®à±€à°°à±‌ వ్యవహారంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త పాట అందుకున్నారు. కశ్మీర్ వివాదాన్ని పరిష్కరించుకునే అంశాన్ని భారత్, పాకిస్తాన్‌లకే వదిలేస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. కశ్మీర్‌ విషయంలో అమెరికా మధ్యవర్తిత్వాన్ని భారత్ తిరస్కరించడంపై ట్రంప్ స్పందిస్తూ.. ‘‘వాస్తవానికి అది మోదీ ఇష్టం. నేను పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌తో సమావేశం అయ్యాను. చాలా గొప్పగా అనిపించింది. నాకు తెలిసి మోదీ, ఇమ్రాన్ అద్భుతమైన వ్యక్తులు. ఇద్దరూ కలిసికట్టుగా వెళ్లగలరని భావిస్తున్నాను..’’ అని పేర్కొన్నారు.
 
దశాబ్దాల నాటి కశ్మీర్ వివాదాన్ని పరిష్కరించుకునేందుకు ఇరు దేశాలు తన సాయం కోరితే అందుకు తాను సిద్ధంగా ఉన్నట్టు ట్రంప్ పునరుద్ఘాటించారు. ఇటీవల తనను కలిసిన పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు కూడా కశ్మీర్ పరిష్కారానికి సాయం చేస్తానని చెప్పినట్టు గుర్తు చేశారు. ట్రంప్ ప్రతిపాదనను భారత్ తిరస్కరించగా... పాకిస్తాన్ స్వాగతించింది. కశ్మీర్ అంశంపై మధ్యవర్తిత్వం వహించాలంటూ ప్రధాని నరేంద్ర మోదీ తనను కోరారంటూ డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన కొద్ది సేపటికే.. భారత విదేశాంగ శాఖ ఆయన వ్యాఖ్యలను కొట్టిపారేసిన సంగతి తెలిసిందే.