కశ్మీర్‌పై కీలక ప్రకటన చేయనున్న అమిత్‌షా

Published: Monday August 05, 2019
కశ్మీర్‌లో భద్రతా పరిస్థితులపై ప్రధాని మోదీ నివాసంలో జరిగిన కేబినెట్ కీలక సమావేశం ముగిసింది. మోదీ సారథ్యంలో జరిగిన సమావేశంలో కేంద్ర హోం మంత్రి అమిత్‌à°·à°¾, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్, భద్రతా వ్యవహారాల సలహాదారు అజిత్ డోవల్, మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ తదితరులు పాల్గొన్నారు. సమావేశానంతరం ఎంపీలు నేరుగా పార్లమెంటు వెళ్లారు.
 
 
కాగా, కశ్మీర్ పరిస్థితిపై హోం మంత్రి అమిత్‌à°·à°¾ ఉభయసభల్లోనూ ఇవాళ ప్రకటన చేయనున్నారు. తొలుత మధ్యాహ్నం 11 గంటలకు రాజ్యసభలోనూ, à°† తర్వాత 12 గంటలకు లోక్‌సభలోనూ ఆయన ప్రకటన చేయనున్నట్లు సమాచారం. జమ్మూకశ్మీర్‌‌లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు (ఈడబ్ల్యూసీ) 10 శాతం రిజర్వేషన్ కల్పించే బిల్లును రాజ్యసభలో  ప్రవేశపెడతారు.