ఆర్టికల్‌ 370 కశ్మీర్‌ను భారత్‌తో మిళితం కానివ్వదు

Published: Wednesday August 07, 2019

‘‘విపక్ష నేతలు చెబుతున్నట్లు ఆర్టికల్‌ 370 కశ్మీర్‌ను భారత్‌తో మిళితం కానివ్వదు. అది.. విడదీస్తుంది. à°† అడ్డుగోడను మేం ఇప్పుడు బద్దలుగొట్టాం’’ అని అమిత్‌à°·à°¾ పేర్కొన్నారు. ఆర్టికల్‌ 370ను రద్దు చేయాలని ‘వారికీ’ ఉన్నప్పటికీ... à°† విషయం చెప్పలేకపోతున్నారని తెలిపారు. తమ ఓటు బ్యాంకు దెబ్బతింటుందనే భయమే దీనికి కారణమని విమర్శించారు. ‘‘ఆహారం, విద్య, వైద్యం, ఉపాధి.. ఆర్టికల్‌ 370 వల్ల ఏం లభించాయి? జ్యోతిష్కుడిని కాకున్నా.. ఇప్పుడు కశ్మీరీల ఆకాంక్షలు నెరవేరుతాయని చెప్పగలను’’ అని తెలిపారు.