అయ్యోమయంలో వలంటీర్లు సరికొత్త నిబంధనలతో సమస్య

Published: Saturday August 10, 2019
గ్రామ వలంటీర్ల ఎంపిక ప్రక్రియ పూర్తీ కాకుండానే పీఆర్‌ అండ్‌ ఆర్‌à°¡à°¿ కమిషనర్‌ విడుదల చేసిన మెమో పత్రం గ్రామ వలంటీర్ల నియామకంపై అయోమయం సృష్టిస్తోంది. వలంటీర్లుగా ఎంపికైన అభ్యర్థుల్లో ప్రస్తుతం చదువు కొనసాగిస్తున్నవారు అర్హులు కారంటూ అలాంటి వారిని గుర్తించి జాబితాను పంపించాలని కమిషనర్‌ మెమో పంపించడంతో ఎంపికైన గ్రామ వలంటీర్లు చదువుతున్నవారు అయోమయంలో పడ్డారు. ప్రకటన ఇచ్చేటప్పుడు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నప్పుడు, ఇంటర్వ్యూలో హాజరైనప్పుడు, కనీసం ట్రైనింగ్‌ ఇచ్చేటప్పుడు కూడా à°ˆ విషయాన్ని అభ్యర్థుల దృష్టికి తీసుకురాకపోవడం శోచనీయం. ఎంపికై నాలుగు రోజులపాటు శిక్షణ పొందిన తరువాత à°ˆ వార్త రావడంతో మండలంలో 20శాతం వలంటీర్లు అయోమయంలో పడ్డారు.
 
 
ప్రభుత్వం తీరుపై ఆగ్ర హాన్ని వ్యక్తం చేస్తున్నారు. సమయాన్ని వృధా చేయడం ప్రభుత్వానికి సరికాదని వలంటీర్లు ఆవేదన చెందుతున్నారు. à°ˆ విషయం ఎంపీడీఓ సుభాషిణమ్మ వివరణ ఇస్తూ బుధవారం కమిషనర్‌ నుంచి మెమోరావడంతో పంచాయతీలవారీగా చదువుతున్న విద్యార్థుల సమాచారాన్ని సేకరిస్తున్నట్లు తెలిపారు. à°’à°• వైపు చదువు కొనసాగిస్తూ మరోవైపు వలంటీర్ల బాధ్యతలను నిర్వహించకపోవడం సాధ్య పడకపోవచ్చని తెలిపారు. 297మంది వలంటీర్లలో 60నుంచి 70మంది విద్యను కొనసాగిస్తున్నవారు ఉండవచ్చని వారి వివరాలు సేకరించి ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు. à°† తరువాత ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందోనని వివరణ ఇచ్చారు. ఏది ఏమైనప్పటికీ వలంటీర్ల ప్రక్రియ పూర్తయిన తరువాత ఇలాంటి కొర్రి పెట్టడం వలంటీర్ల అయోమయానికి గురిచేసింది.