మీసేవ రద్దు చేసే ఆలోచన లేదు..

Published: Monday August 12, 2019

 à°®à±€ సేవలను రద్దు చేయాలనే ఆలోచన అనేది లేదని ఉప ముఖ్యమంత్రి ఆళ్ళ నాని అన్నారు. ఆదివారం మీసేవ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఆపరేటర్లు వినతిపత్రం అందించారు. à°ˆ సందర్భంగా నాయకులు వి.పార్థసారథి, à°Ÿà°¿.పాపారావు గుప్తా మాట్లాడుతూ పత్రికల్లో వస్తున్న ప్రకటనల వల్ల మీసేవ ఆపరేటర్లు తీవ్ర ఆందోళనలో ఉన్నారన్నారు. 9 వేల మీసేవలు, 30 వేల కుటుంబాలు గ్రామీణ ప్రాంత మీసేవలపై ఆధారపడి జీవిస్తున్నారన్నారు. ఉన్నత చదువులు చదివి స్వయం ఉపాధి పొందుతున్నారని తెలిపారు. ఇప్పటికీ చాలీచాలని కమీషనర్లతో మీసేవ సెంటర్‌లను నడుపుతున్నారన్నారు. ప్రభుత్వమే మీసేవ సెంటర్లను నడపాలనుకుంటే ఇప్పటికే ఉన్నవారిని తీసుకోవాలని కోరారు. ఉద్యోగ భద్రత కల్పించి ఉపాధిని కాపాడాలని కోరారు. దీనిపై నాని స్పందిస్తూ ఇప్పటి వరకు కేబినేట్‌లో చర్చకు మీసేవ విషయంపై రాలేదన్నారు. జి.ఎల్‌ గణేష్‌, కె.పాండు, భగత్‌, జి.వెంకటేశ్వరరావు, బాలాజీ, పవన్‌, తదితరులు పాల్గొన్నారు.