మోదీ ప్రభుత్వం తీసుకున్న రెండు కీలక నిర్ణయాలు

Published: Friday August 16, 2019
à°’à°• నిర్ణయం లేదా చర్య మంచి చెడ్డలు నిర్ధారితమవ్వడానికి కాలం పట్ట వచ్చు గానీ, తక్షణ ప్రతిస్పందనలు, సదరు నిర్ణయం లేదా చర్య సానుకూల, ప్రతికూల పర్యవసానాలను తప్పక సూచిస్తాయి. అధికరణ 370పై లోక్‌సభలో జరిగిన చర్చలో కాంగ్రెస్ సభ్యుడు శశి థరూర్ చేసిన à°’à°• వ్యాఖ్యే ఇందుకొక నిదర్శనం. జమ్మూ కశ్మీర్‌కు భారత రాజ్యాంగం కల్పించిన ప్రత్యేక హోదా రద్దుకు పూనుకోవడం, 2016లో అమలుపరిచిన డిమానిటైజేషన్ (చలామణీ నుంచి కరెన్సీ నోట్ల ఉపసంహరణ)కు తుల్యమైన రాజకీయ చర్య అని, ఫలితాలు జాతి హితానికి దోహదం చేయబోవని శశి థరూర్ హెచ్చరించారు ( పార్లమెంటరీ నైపుణ్యాల ప్రాతిపదికన చూసినప్పుడు లోక్‌సభలో కాంగ్రెస్ నాయకుడుగా, అసంబద్ధంగా మాట్లాడే అధీర్ రంజన్ చౌధురి స్థానంలో శశి థరూరే వుండడం వాంఛనీయం అని చెప్పటానికి నేను సందేహించను). శశి థరూర్ నిర్మలంగా, నిష్పాక్షికంగా చేసిన à°† వ్యాఖ్య అత్యుక్తిగా కన్పించవచ్చు గానీ నిశితంగా పరిశీలిస్తే అధికరణ 370ని నిర్వీర్యం చేసిన తీరు, రూ.500, రూ.1000 కరెన్సీ నోట్ల ఉపసంహరణ వైనం మధ్య స్పష్టమైన సాదృశ్యాలు అవగతమవుతాయి. రాజకీయ నిర్ణయాలు తీసుకోవడంలో నరేంద్ర మోదీ- అమిత్ à°·à°¾ ద్వయం అనుసరించే పద్ధతులను అర్థం చేసుకోవడానికి కూడా à°† సాదృశ్యాలు తోడ్పడతాయి.
 
అప్పుడూ (2016లో) ఇప్పుడూ (2019లో) à°† రెండు ప్రసిద్ధ నిర్ణయాల (నోట్ల రద్దు, 370 రద్దు) ను అత్యంత గుట్టుగానూ, అతి తక్కువ సంప్రతింపులతో మాత్రమే తీసుకున్నారు. డీమానిటైజేషన్ సందర్భంలో గోప్యత తప్పనిసరి. ఎందుకంటే ‘నోట్ బందీ’ స్వభావమే à°† చర్యను అత్యంత రహస్యంగా అమలుపరచడాన్ని అనివార్యం చేసింది. అధికరణ 370 రద్దు విషయానికి వస్తే, అది, భారతీయ జనసంఘ్‌à°—à°¾ వర్ధిల్లిన కాలం నుంచీ తమ పార్టీ ఎజెండాలో ఉందని పాలక పక్షం వర్గాలు వాదిస్తున్నాయి. ఇప్పుడు పార్లమెంటులో తమ పార్టీకి పూర్తి మెజారిటీ ఉన్నందున à°† నిర్ణయాన్ని అమలుపరిచామని, తద్వారా చాలాకాలంగా చేస్తున్న à°’à°• ఎన్నికల హామీని నెరవేర్చామని భారతీయ జనతా పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. 2015 తుదినాళ్ళ వరకు కూడా జమ్మూ కశ్మీర్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకై ముఫ్తీ మహమ్మద్ సయీద్ నేతృత్వంలోని పీడీపీతో బీజేపీ కలిసి పని చేసింది. à°† పొత్తు కారణంగానే వివాదాస్పద అధికరణ 370పై తమ నిర్ణయం అమలును వాయిదా వేసేందుకు బీజేపీ అంగీకరించింది. ముఫ్తీ పార్టీతో పొత్తు తెగతెంపులు అవ్వడంతో నరేంద్ర మోదీ, -అమిత్ à°·à°¾ ద్వయం అధికరణ 370ని రద్దు చేసేందుకు (కశ్మీర్ రాజకీయ పక్షాలనేకాదు, చివరకు కశ్మీర్ లోయ ప్రజలను సైతం ఏ మాత్రం సంప్రదించకుండానే) పూనుకున్నారు.
 
నోట్ల రద్దు, అధికరణ 370 రద్దు రెండు సందర్భాలలోనూ అంతకంతకూ పెచ్చరిల్లుతూ పరివ్యాప్తమవుతున్న నిరంకుశాధికార తత్వం, ఒక ప్రజాస్వామ్య వ్యవస్థకు సంబంధించిన సంస్థాగత ప్రక్రియలను పూర్తిగా ఉపేక్షించింది. మరింత స్పష్టంగా చెప్పాలంటే నిర్వీర్యం చేసింది. ఆర్థిక నిపుణుల అభ్యంతరాలను తోసిపుచ్చి ప్రభుత్వం ఏకపక్షంగా తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం ఫలితంగా రిజర్వ్ బ్యాంక్ స్వతంత్ర ప్రతిపత్తి బాగా బలహీనపడింది. అధికరణ 370 రద్దును వ్యతిరేకించే విషయంలో పార్లమెంటు తనకు తానే దుర్భలమై పోయింది. శశి థరూర్ మాటల్లో చెప్పాలంటే మోదీ ప్రభుత్వం, పార్లమెంటును ఒక చర్చా వేదికగా గాకుండా ఒక నోటీస్ బోర్డ్ గా మాత్రమే పరిగణించింది.
 
నోట్ల రద్దు, 370 రద్దు రెండిటినీ సమున్నత నియమాలకు అనుగుణంగా తీసుకున్న నిర్ణయాలని ప్రభుత్వం ఘంటాపథంగా చెప్పింది. అవినీతి నిర్మూలనే లక్ష్యంగా చేపట్టిన à°’à°• ‘నైతిక మహోద్యమం’à°—à°¾ నోట్లరద్దును అభివర్ణించారు. జాతీయ సమైక్యతే ధ్యేయంగా ‘ఒకే జాతి, ఒకే జెండా, ఒకే రాజ్యాంగం’ ఉద్యమంలో భాగమే అధికరణ 370 రద్దు అని ఘోషించారు. నిజమేమిటి? నోట్ బందీగానీ, కశ్మీర్ ప్రత్యేక హోదా రద్దుగానీ ఎటువంటి ఉజ్వల, ఉదాత్త విలువల ప్రేరణతో చేపట్టిన చర్యలు à°Žà°‚à°¤ మాత్రమూ కావు. నోట్ల రద్దుతో జరిగిందేమిటి? నల్లధనం అపరిమితంగా ఉన్న సంపన్నులు దానిని అత్యంత సులువుగా చట్టబద్ధం చేసుకున్నారు! చిల్లర వర్తకులు, చిన్న వ్యాపారస్తులు మాత్రం కోలుకోలేని విధంగా నష్టపోయారు. అధికరణ 370ని, నిస్సిగ్గుగా అనైతిక పద్ధతిలో నిర్వీర్యం చేశారు. à°† క్రమంలో రాజ్యాంగ స్ఫూర్తిని పూర్తిగా నిర్లక్ష్యం చేసి, రాష్ట్రంగా ఉన్న జమ్మూ -కశ్మీర్‌ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా ఏర్పాటు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలోని మిగతా రెండు ప్రాంతాలపై కశ్మీర్ లోయ రాజకీయ ఆధిపత్యాన్ని పూర్తిగా కూలదోసే ఏకైక లక్ష్యంతోనే జమ్మూకశ్మీర్‌ను విభజించడం జరిగింది. అధికార కేంద్రీకరణ ఆరాటంతో, à°† సమస్యాత్మక రాష్ట్రాన్ని పూర్తిగా కేంద్రం నియంత్రణలోకి తీసుకునేందుకై రాజ్యాంగంలో సమున్నతంగా పొందుపరిచిన సమాఖ్య పద్ధతి, స్ఫూర్తిని పూర్తిగా అలక్ష్యం చేశారు.