మార్టిన్‌ లూథర్‌లానే నాకూ కలలున్నాయి

Published: Monday August 19, 2019
మార్టిన్‌ లూథర్‌లానే నాకూ కలలున్నాయి. రాష్ట్రాన్ని ఆనందాంధ్ర ప్రదేశ్‌à°—à°¾ మార్చాలని.. వివక్ష లేకుండా అందరూ సంతోషంగా ఉండేలా పాలన అందించాలని.. రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధిని సాధించాలన్న స్వప్నం నాకుంది’ అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి చెప్పారు. పాలకులు మనసుపెడితే సాధించలేనిదేమీ లేదన్నారు. అమెరికాలో నివసిస్తున్న ప్రవాసాంధ్రులంతా ఏడాదికి ఒక్కసారైనా రాష్ట్రానికి రావాలని కోరారు. వారి స్వగ్రామాల్లో, పట్టణాల్లో అభివృద్ధికి కృషి చేయాలని.. పారిశ్రామికంగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని పిలుపిచ్చారు. అమెరికా పర్యటనలో భాగంగా ఆదివారం డాల్‌సలోని ప్రవాసాంధ్రులతో ఆయన సమావేశమయ్యారు. à°ˆ సందర్భంగా ఆయన ప్రసంగం ఇదీ.. ‘అమెరికాలో ఉన్నా నాన్నగారిని, మా కుటుంబాన్ని, నన్ను అమితంగా ప్రేమించే మీ హృదయాలన్నిటికీ జగన్‌ అనే నేను నిండు మనసుతో ప్రేమాభివందనాలు చేస్తున్నాను.
 
అమెరికాలో ఉంటున్నా ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఎన్నికల్లో ఇక్కడి అమెరికాలోని తెలుగు సమాజం పోషించిన పాత్ర à°Žà°‚à°¤ గొప్పదో నాకు బాగా తెలుసు. 175 నియోజకవర్గాలకు 151 స్థానాలు గెలిచామంటే.. 25 పార్లమెంటు స్థానాలకు .. 22 ఎంపీ స్థానాలు గెలిచామంటే.. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ కనీవినీ ఎరుగని విధంగా 50 శాతం ఓటు బ్యాంకు సాధించామంటే.. వీటన్నింటిలో ఇక్కడి అమెరికన్‌ తెలుగు సమాజం చేసిన కృషి ఎంతో ఉందని చెప్పడానికి ఏమాత్రమూ సంకోచించడం లేదు. ఖండాలు దాటి వెళ్లినా ఆంధ్రప్రదేశ్‌ మీద, తెలుగు రాష్ట్రాల మీద, మనదేశం మీద, అన్నింటికీమించి నాన్నగారి మీద, నామీద చెక్కు చెదరని మీ ప్రేమాభిమానాలకు మరొకసారి జగన్‌ సెల్యూట్‌’
మీ అందరినీ చూసి గర్వపడుతున్నాం..
‘అమెరికాలో అమెరికన్లతో పాటు వారికి మించి ఎదుగుతున్న మీ అందరినీ చూసి మేమెంతో గర్వపడుతున్నాం. మా దేశానికి భారతీయ సమాజం ఎంతో మేలు చేసిందని అమెరికా అధ్యక్షుడు సైతం ప్రత్యేకంగా మన తెలుగువారి గురించి.. మన భారతీయుల గురించి ప్రస్తావిస్తున్నప్పుడు ఎంతో గర్వపడతాం. ఇక్కడ భారతీయలు దాదాపు 41 లక్షల మంది ఉన్నారు. వీరిలో 4 లక్షల మంది తెలుగువారే. మన రాష్ట్రాన్ని విడిచిపెట్టి వచ్చి ఇక్కడ స్థిరపడి రాణిస్తున్నారంటే.. ముఖ్యంగా à°ˆ ప్రతిభను చూసి ముచ్చటేస్తోంది.
 
తెలుగువారి ఆత్మగౌరవాన్ని పెంపొందించడమే కాకుండా ప్రతి మనిషి, ప్రతి కుటుంబం, ప్రతి సామాజికవర్గం గౌరవం కూడా పెంపొందించేలా.. ఆర్థికంగా.. రాజకీయంగా.. సామాజికంగా చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా à°ˆ రెండున్నర నెలల్లోనే రాష్ట్రప్రభుత్వం చర్యలు తీసుకున్నదని మీ అందరి ప్రతినిధిగా సగర్వంగా ప్రకటిస్తున్నాను. ఏ దేశచరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం.. నవజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణమని శ్రీశ్రీ అన్నారు. à°ˆ పరిస్థితిని మార్చడానికి అమెరికాలో కూడా ఇక్కడో మనిషి గతంలో తన ప్రాణాలు పణంగా పెట్టిన చరిత్రను చూశాం. గాంధేయమార్గం, అంబేడ్కర్‌ రాసిన రాజ్యాంగం ఇక్కడి దేశభక్తులను ప్రభావితం చేస్తే .. అమెరికాలో మానవ హక్కులూ సమాన హక్కుల కోసం వర్ణ వివక్షలేని సమాజం కోసం పోరాడిన మహాయోధుడు మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ జూనియర్‌.
 
ఆయన్ను మనదేశంలో కూడా అనేకమంది స్ఫూర్తిదాయకంగా తీసుకుంటారు. ‘ఐ హేవ్‌ ఏ డ్రీమ్‌.. దట్‌ వన్‌ డే దిస్‌ నేషన్‌ కెన్‌ రైజ్‌ అప్‌’ అంటూ ఆయన చేసిన ప్రసంగం స్ఫూర్తిదాయకం. పాలకులు ధ్యాస పెడితే మార్పు తీసుకురావడం సులభమవుతుంది. చెడు నుంచి మంచికీ.. పేదరికం నుంచి సంపదకు.. అవినీతి నుంచి నీతికి, మొరటుతనం నుంచి మానవత్వానికి.. అరాచకం నుంచి చట్టబద్ధ ప్రభుత్వాలు నిర్మించుకునేందుకు వివక్ష లేని సమానత్వానికీ.. రక్తపాతం నుంచి శాంతియుత సహజీవనానికి.. దోపిడీ నుంచి మానవ కారుణ్యానికీ.. చీకటి నుంచి వెలుగులోకి ప్రయాణం చేస్తేనే మాన నాగరికతకు అర్థం ఉంటుంది. ప్రతి జాతీ.. ప్రతి దేశం.. ప్రతి సమాజం అటువంటి ప్రయాణం చేయాలి. మార్పు తీసుకురావాలంటే.. నాయకత్వం నుంచే అది మొదలు కావాలి.’
నాకూ లక్ష్యమూ.. స్వప్నమూ ఉన్నాయి
‘నాకూ à°’à°• లక్ష్యం ఉంది. నాకూ à°’à°• స్వప్నం ఉంది. మహానేత డాక్టర్‌ వైఎ్‌సఆర్‌ గారి తనయుడిగా 50 శాతం ఏపీ ప్రజల మనసు గెలుచుకున్న పార్టీ అధినేతగా, పదేళ్లుగా నిరంతరం ప్రజల్లోనే గడుపుతున్న నేతగా.. అన్నింటికీ మించి 3,648 కిలోమీటర్ల కాలినడకన 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌లో పల్లెపల్లెలో.. పట్టణాల్లో నడచిన నాయకుడిగా నాకూ కొన్ని లక్ష్యాలున్నాయి. అవినీతి, లంచగొండితనంలేని ఆంధ్రప్రదేశ్‌ను నిర్మించాలని à°’à°• స్వప్నం. అన్నం పెడుతున్న రైతులకు అన్నం దొరకక అప్పులపాలై ఆత్మహత్య చేసుకునే పరిస్థితి à°† రైతన్నకు ఇక రానే రాకూడదన్నది నాకొక స్వప్నం.
 
దేశంలో నిరక్షరాస్యత రేటు 26 శాతమైతే.. మన రాష్ట్రంలో 2011 జనాభా లెక్కల ప్రకారం నిరక్షరాస్యత రేటు 33 శాతం. దీన్ని సున్నాకు తీసుకురావాలన్నది నా స్వప్నం. బ్రిక్స్‌ దేశాల్లో గ్రాస్‌ ఎన్‌ రోల్‌మెంట్‌ రేషియోను చూస్తే రష్యాలో 81 శాతమైతే.. చైనా 48 శాతమైతే ..బ్రెజిల్‌ 50 శాతమైతే.. మన దేశంలో కేవలం 25 శాతమే. దీన్ని మన రాష్ట్రంలో 95 శాతానికి తీసుకువెళ్లడమే నా స్వప్నం. పల్లెలు కళకళలాడాలని.. అక్కడి ప్రభుత్వ బడుల్లో మంచి చదువులుండాలని నా స్వప్నం. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యం గొప్పగా ఉండాలని స్వప్నం. ఏ పేదవాడూ సొంత ఇల్లు లేదనకుండా అందరికీ సొంత ఇల్లు నిర్మించాలన్నదే నా స్వప్నం. ఏ ఒక్క తల్లీ తన పేదరికం వల్ల తమ బిడ్డలకు చదువు చెప్పించుకోలేక బాధపడకూడదన్నదే నా స్వప్నం. ఏ ఒక్కరూ నిరుద్యోగంతో పస్తులతో పడుకోకూడదన్నది నా స్వప్నం.