20రోజుల సంప్రదాయ యుద్ధానికి రెడీ

Published: Tuesday August 20, 2019
 à°ªà°¾à°•à°¿à°¸à±à°¥à°¾à°¨à±‌తో స్వల్పకాలిక, తీవ్రస్థాయి యుద్ధానికి తాము సిద్ధంగా ఉన్నామని సైన్యాధ్యక్షుడు జనరల్‌ బిపిన్‌ రావత్‌ కేంద్ర ప్రభుత్వ అధిపతులకు తెలియజేశారు. ‘‘పాకిస్థాన్‌ భూభాగంలోకి చొచ్చుకెళ్లి మరీ యుద్ధం చేయగలం. 20రోజుల పాటు ప్రత్యర్థితో సంప్రదాయ యుద్ధం చేయడానికి తగిన ఆయుధాలు మన దగ్గరున్నాయి’’ అని విశదపరిచారు. పదవీ విరమణ చేసిన కొందరు సైన్యాధికారులతో సోమవారం రావత్‌ సమావేశమయ్యారు. à°† సమయంలో ఆయన à°ˆ విషయాన్ని వెల్లడించారు. ‘‘2016లో ఉడీ దాడి జరిగిన వెంటనే సమీక్షలు జరిగాయి. 19 మంది సైనికులు ప్రాణాలు కోల్పోవడానికి సాయుధ సంపత్తి లేకపోవడమే కారణమని గుర్తించారు.
 
వెంటనే దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారు. దాదాపు 11వేల కోట్ల రూపాయల ఆయుధాలను కొనుగోలు చేశారం. వీటిలో 95ు ఇప్పటికే మన దళాలకు చేరాయి. మరో 9000 కోట్ల రూపాయల ఆయుధాల కొనుగోలుకు సంబంధించి చర్చలు పూర్తయ్యేదశలో ఉన్నాయి’’ అని సైనికదళాల వర్గాలు వివరించాయి. పాకిస్థాన్‌ ఎలాంటి కవ్వింపులకు పాల్పడ్డా పాక్‌ భూభాగంలోకి వెళ్లి మరీ యుద్ధాన్ని కొనసాగించగలమని ఆర్మీ ఛీఫ్‌ తెలిపినట్లు à°† వర్గాలు వెల్లడించాయి.