ముదురుతున్న ‘హిందూయేతర’ వివాదం

Published: Tuesday August 20, 2019
శ్రీశైలంలో హై టెన్షన్‌ నెలకొంది. మంగళవారం నాడు చలో శ్రీశైలం కార్యక్రమానికి హిందూ సంఘాలు పిలుపునివ్వడంతో క్షేత్రంపై పోలీసు బలగాలు మోహరించారు. ఆందోళన చేసి తీరుతామని హిందూవాదులు చెబుతుండగా.. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. వివరాలు ఇలా.. శ్రీశైలం ప్రధాన ఆలయానికి ఎదరుగా గంగాధర మండపం నుంచి నంది మండపం వరకు, అక్కడి నుంచి పోస్టాఫీసు వరకు దుకాణాలు ఉన్నాయి. ఇవి ఉత్సవాలకు అడ్డుగా మారడంతో తొలగించాలని నిర్ణయించారు. ప్రత్యామ్నాయంగా వ్యాపారుల కోసం రూ.10 కోట్లతో లలితాంబ దుకాణ సముదాయాన్ని నిర్మించారు. ఇందులో 30 దుకాణాలను చెంచులకు కేటాయించారు. మిగిలిన 183 దుకాణాలను హైకోర్టు ఆదేశాల మేరకు బహిరంగ వేలం వేశారు. వ్యాపారులు లక్కీడిప్‌ ద్వారా పొందేందుకు యత్నించడంతో వీహెచ్‌పీ హైకోర్టును అశ్రయించింది. అయితే గతంలో కొన్ని దుకాణాల్లో హిందూయేతరులు కూడా ఉన్నారు. తమకూ వేలంలో పాల్గొనే అవకాశం ఇవ్వాలని వారు కోర్టును అశ్రయించారు. దీంతో వారికి వేలం దరఖాస్తులు ఇవ్వాలని, తదుపరి దేవదాయశాఖ నిబంధనల మేరకు వేలంలో పాల్గొనే అవకాశం కల్పించాలని ఆదేశించినట్లు సమాచారం.
 
à°ˆ నెల 16à°¨ నూతన దుకాణాలకు బహిరంగ వేలం నిర్వహిస్తామని దేవస్థానం పత్రికా ప్రకటన ఇచ్చింది. దుకాణాలను దక్కించుకునేందుకు వ్యాపారులు భారీగా తరలివచ్చారు. వీరిలో కొందరు హిందూయేతరులు ఉన్నారు. à°† సమయంలో అక్కడే ఉన్న బీజేపీ శ్రీశైలం నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ బుడ్డా శ్రీకాంత్‌రెడ్డి వారిని అడ్డుకున్నారు. దీంతో హిందూయేతరులకు బీజేపీ నాయకులకు మధ్య వాగ్వాదం, తోపులాట జరిగాయి. ఇలా వివాదం మొదలైంది. à°† తరువాత పలువురు హిందూవాదులు, పీఠాధిపతులు శ్రీశైలంలో హిందూయేతరుల వ్యవహారంపై స్పందించారు. వారి జోక్యాన్ని అడ్డుకుంటామని ప్రకటించారు. హిందూయేతరులకు దుకాణాలు, కాంట్రాక్టులు కేటాయించడాన్ని ఖండించారు.
 
 
శ్రీశైలం ఈవో శ్రీరామచంద్రమూర్తి బదిలీ అయ్యారు. à°ˆ మేరకు చీఫ్‌ సెక్రెటరీ ఎల్వీ సుబ్రమణ్యం సోమవారం జీవో ఆర్టీ నెం.1885 జారీ చేశారు. రంపచోడవరం స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్‌ కేఎస్‌ రామారావును నూతన ఈవోగా నియమించారు. శ్రీరామచంద్రమూర్తి పోలవరం డిప్యూటీ కలెక్టర్‌à°—à°¾ విధులు నిర్వహిస్తు 2018 జూన్‌ 16à°¨ శ్రీశైలం ఈవోగా వచ్చారు. సుమారు 14 నెలల పాటు విధులు నిర్వహించారు. నూతన ఈవో రెండురోజుల్లో బాధ్యతలు స్వీకరిస్తారని తెలిసింది.
 
ఈవోగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి శ్రీరామచంద్రమూర్తి చుట్టూ అనేక వివాదాలు చోటు చేసుకున్నాయి. మొదటి రెండు నెలలు ఆయన పరిపాలనకు సంబంధించిన ఫైల్స్‌ చూడలేదు. దేవస్థానం అభివృద్ధి అంతంతమాత్రమే. మాస్టర్‌ ప్లాన్‌ను అనుకున్న స్థాయిలో ముందుకు తీసుకెళ్లలేదు. మొదటి విడత మాస్టర్‌ ప్లాన్‌లో ఉన్న క్యూకాంప్లెక్స్‌ పనులు అటకెక్కించారు. ఆయన వ్యవహార శైలిపై అర్చకులు, వేదపండితులు అసంతృప్తిగా ఉఆ్నరు. ఆందోళన నిర్వహించాలని ప్రయత్నించారు.
 
లలితాం దుకాణ సముదాయం బహిరంగ వేలంపాటలు పారదర్శకంగానే నిర్వహించాం. మీడియా సమక్షంలో వేలం జరిగింది. కోర్టు ఉత్తర్వులను అమలు చేశాం. ఇప్పటి వరకు 133 దుకాణాలకు వేలం పూర్తిచేశాం. జీవో.నెం.426 దేవదాయశాఖ చట్టం ప్రకారం హిందూయేతరులు 36 మంది దరఖాస్తులను తిరస్కరించాం. వారిని వేలంలో పాల్గొనన్విలేదు. కొంతమంది పనిగట్టుకుని అసత్య ప్రచారం చేస్తున్నారు. భక్తులు వాటిని నమ్మవద్దు.