దిగొచ్చిన బిల్డింగ్ మెటీరియల్ ధరలు

Published: Tuesday August 27, 2019
ఇసుక మహత్మ్యంతో బిల్డింగ్‌ మెటీరియల్‌ ధరలు ఒక్కసారిగా దిగొచ్చాయి. ఇసుక లభ్యత తగ్గిన దరిమిలా సిమెంటు బస్తాపై రూ.100 తగ్గింది. వర్షాకాలం పండు ఇటుకకు డిమాండ్‌ ఉండేది. à°—à°¤ ఏడాది ఆగస్టులో వెయ్యి ఇటుకలు రూ.6,500 అమ్మగా ఇప్పుడు రూ.4,500 లకు పడిపోయింది. ఇసుక కొరతకు ముందు పరుగులు తీసిన ఐరన్‌ ధర ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. మైనర్‌ ప్లాంట్ల ఐరన్‌ ధర టన్ను రూ.40 వేల నుంచి రూ.42 వేలు ఉండగా, మేజర్‌ ప్లాంట్ల ఐరన్‌ ధర రూ.45 వేలు ఉంది. మూడు నెలలకు ముందు రూ.52 వేలువున్న ఐరన్‌ ధర గణనీయంగా పడిపోయింది. మరో నెల మూఢం ఉండడం, ఇసుక అవసరాలకు సరిపడా లభ్యం కాకపోవడంతో ఇప్పట్లో ఐరన్‌ ధరలు పెరిగే అవకాశాలు లేవని వర్తకులు చెబుతున్నారు. అధిక ధరలకు కొని ఇప్పుడు తగ్గించి అమ్మాల్సి వస్తోందని ఐరన్‌ రిటైల్‌ వర్తకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
 
భవన నిర్మాణాలలో కాంక్రీట్‌ పనులకు వినియోగించే ముప్పాతిక సైజు à°•à°‚à°•à°° ధర మేలో మూడు యూనిట్ల నల్లకంకర ధర రూ.15 వేలు ఉండగా, ఇప్పుడు రూ.10 వేలకు పడిపోయింది. ఇటుక బట్టీ యజమానులు తమ ఇటుక పరిశ్రమలను నిర్వహించలేమని చేతులెత్తేస్తున్నారు. ఇటుక తీయడానికి వినియోగించే మట్టి, బూడిద, à°Šà°• వంటి ముడి సరుకు ధరలు పెరిగిపోయాయి. మరోవైపు కార్మికుల కొరత వేధిస్తున్నది. à°ˆ పరిస్థితుల్లో నష్టంతో వ్యాపారం చేయడం కష్టమని బట్టీ యజమానులు చెబుతున్నారు. ఇటుక తయారై అమ్మకానికి వచ్చే సరికి తమకు ఇటుక బట్టీ వద్దే à°’à°• ఇటుక ధర రూ.5 దాటుతుందని, అంతకంటే ఇప్పుడు తగ్గించి అమ్మాల్సి వస్తోందని వాపోతున్నారు. తూర్పు గోదావరి జిల్లా నుంచి, సిద్ధాంతం పరిసరాల ప్రాంతాలు, నరసాపురం తీర ప్రాంతం నుంచి ట్రాక్టర్లపై ఇటుక తెచ్చి అమ్మకాలు జరుపుతున్నారు. స్థానిక ఫైర్‌స్టేషన్‌ వద్ద ట్రాక్టర్లు నిలిపి అమ్మకందార్లు భవన నిర్మాణాల వద్దకు వెళ్లి ఇటుక బేరం కుదుర్చుకుంటారు. ఇప్పుడు నిర్మాణాలు నిలిచిపోవడంతో ఇటుక ట్రాక్టర్లు à°’à°•à°Ÿà°¿, రెండు రోజులు అన్‌ లోడ్‌ చేయకుండానే ఉంచేయాల్సి వస్తుంది.
 
ఇప్పుడు పర్మిట్లతో ఇసుక సరఫరా జరుగుతున్నప్పటికీ సంబంధిత అధికారుల వద్దకు వెళ్ళి పర్మిట్‌ తీసుకుని ఇసుక కొనుగోలు చేసుకునే విధానం కష్టంతో కూడుకున్నది కావడంతో అధిక శాతం భవన నిర్మాణదార్లు పనులను నిలిపివేశారు. నాలుగింట à°’à°• వంతు మాత్రమే పనులు జరుగుతున్నాయి. దీంతో భవన నిర్మాణ సామగ్రి ధరలు తగ్గుముఖం పట్టాయి. అంతేకాకుండా అమ్మకాలు గణనీయంగా పడిపోయాయి. కొందరైతే షాపులు మూసివేశారు. మరి కొందరు అప్పులో అప్పు అంటూ వ్యాపారాలు సర్దేసి విహారయాత్రకు వెళుతున్నారు. ఇటీవల పాలకొల్లు పట్టణంలో ఇసుక, à°•à°‚à°•à°° సరఫరా చేసే పలువురు యుకులు గోవా వంటి ప్రాంతాలకు విహార యాత్రకు వెళ్ళారు. భవన నిర్మాణానికి అనుబంధంగా ఉండే ఫ్లంబింగ్‌, ఎలక్ట్రికల్‌, శానిటరీ, హార్డ్‌వేర్‌, టైల్స్‌, మార్బుల్స్‌ వంటి షాపులు కొనుగోలుదారులు లేక వెలవెలబోతున్నాయి. వచ్చే నెల 5à°µ తేదీ నుంచి ఇసుక స్టాక్‌ పాయింట్ల ద్వారా ప్రభుత్వమే నేరుగా అమ్ముతుందని ప్రకటించడంతో భవన నిర్మాణ, అనుబంధ వ్యాపారులు ఆశగా ఎదురుచూస్తున్నారు.