పథకాల మోత.. బడ్జెట్‌కు వాత

Published: Wednesday August 28, 2019
సంక్షేమ పథకాల భారం రాష్ట్రబడ్జెట్‌ను తలకిందులు చేస్తోంది. వైసీపీ ప్రభుత్వం తన తొలి బడ్జెట్‌లో ఆదాయానికి, ఖర్చులకు పెద్దగా తేడా చూపించలేదు. రూ.1.78 లక్షల కోట్ల ఆదాయం వస్తుందని.. రెవెన్యూ లోటు కేవలం రూ.1,778 కోట్లు ఉంటుందని పేర్కొన్నారు. కానీ నెలనెలా భారీగా ఆదాయం లోటు ఏర్పడుతోంది. నవరత్నాల పథకాలు, సంక్షేమ స్కీములకు.. బడ్జెట్‌ అంచనాలతో సంబంధం లేకుండా ప్రభుత్వ సంస్థలు తెచ్చే అప్పులే (ఆఫ్‌ బడ్జెట్‌ బారోయింగ్స్‌) ఇప్పుడు ప్రభుత్వానికి దిక్కుగా మారాయి.
 
ఇది తప్ప నిధులు సమకూరే మార్గం కనిపించడం లేదు. ఆర్థికశాఖ సిద్ధం చేసిన గణాంకాల ప్రకారం.. రాష్ట్రానికి పన్ను, పన్నేతర ఆదాయం ద్వారా సగటున నెలకు రూ.8,500 కోట్ల ఆదాయం వస్తుంది. రుణాల ద్వారా రూ.3,000 కోట్లు సమకూరుతున్నాయి. అంటే సగటున నెలకు వచ్చే ఆదాయం రూ.11,500 కోట్లు. ఇందులో ఉద్యోగుల వేతనాలకు, పెన్షన్లకు రూ.5,000 కోట్లు, సంక్షేమ పెన్షన్లకు రూ.1,250 కోట్లు, విద్యుత్‌ సబ్సిడీకి రూ.550 కోట్లు, రుణాల చెల్లింపులకు రూ.2500 కోట్లు, బియ్యం సబ్సిడీకి రూ.450 కోట్లు, ఏపీఎ్‌సఆర్టీసీకి సహాయం à°•à°¿à°‚à°¦ నెలకు రూ.250 కోట్లు తప్పనిసరి ఖర్చు ఉంటుంది.
 
ప్రతి నెలా à°ˆ ఖర్చే రూ.10,000 కోట్ల వరకు ఉంటుందన్న మాట. సగటున నెలకు వస్తున్న ఆదాయం రూ.11,500 కోట్లలో దీన్ని మినహాయిస్తే మిగిలేది రూ.1,500 కోట్లు. ప్రభు త్వం ప్రారంభించిన నవరత్నాలు, ఇతర సంక్షేమ పథకాల అమలుకు à°ˆ రూ.1,500 కోట్లు ఏ మూలకూ సరిపోవు. à°…à°‚ దుకే బడ్జెట్‌ పరిధిలో చూపని అప్పుల ద్వారా నిధులు తెచ్చుకోవాలని ఆర్థిక శాఖ ఆలోచిస్తోంది.
 
 
సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో ప్రభుత్వం నవరత్నాల à°•à°¿à°‚à°¦ కొన్ని సంక్షేమ పథకాలు ప్రారంభించనుంది. à°ˆ రెండు నెలలకు గాను తప్పనిసరి ఖర్చులు పోను అదనంగా రూ.15,230 కోట్లు కావాలని ఆర్థికశాఖ అంచనా. సెప్టెంబరులోనే అదనంగా రూ.8,630 కోట్లు అవసరమవుతాయి. ఇందులో రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ రూ.1,800 కోట్లు, తిత్లీ తుఫాను ఉపశమన నిధులు రూ.150 కోట్లు, పంటల బీమాకు రూ.1,100 కోట్లు, వైఎస్సార్‌ బీమాకు రూ.550 కోట్లు, గండికోట, ఇతర ప్రాజెక్టుల కోసం రూ.1,000 కోట్లు, ట్యాక్సీ డ్రైవర్లకు సహాయం కోసం రూ.400 కోట్లు, క్రీడల మౌలిక సదుపాయాల కోసం రూ.20 కోట్లు, ఎన్‌టీపీసీకి రుణ చెల్లింపుల à°•à°¿à°‚à°¦ రూ.3,500 కోట్లు, గ్రామ వలంటీర్లకు నెలకు రూ.100 కోట్లు అవసరం.
 
ఇక అక్టోబరులో అదనంగా 6,600 కోట్ల వరకు అవసరమవుతాయి. వైఎస్సార్‌ రైతు భరోసా పథకాన్ని అక్టోబరు 15 నుంచి ప్రారంభిస్తున్న నేపథ్యంలో దీనికి రాష్ట్ర వాటాగా రూ.5,500 కోట్లు చెల్లించాలి. అలాగే కేంద్ర ప్రాయోజిత పథకాలకు, స్మార్ట్‌ సిటీల పథకానికి పెండింగ్‌లో ఉన్న బిల్లుల్లో రూ.1,000 కోట్లను అక్టోబరులో చెల్లించాలి. ఇంత మొత్తానికి ఆఫ్‌బడ్జెట్‌ అప్పులు తప్పనిసరని ఆర్థిక శాఖ భావిస్తోంది.