పాకిస్తాన్‌పై యుద్ధానికి వస్తే భారత్ 22 ముక్కలవుతుంది

Published: Tuesday September 03, 2019
జమ్మూ కశ్మీర్‌పై భారత్-పాకిస్తాన్ మధ్య మాటల యుద్ధం మరింత తీవ్రమవుతోంది. అణు యుద్ధానికి సిద్ధమంటూ బెదిరింపులకు దిగుతున్న పాకిస్తాన్... తాజాగా అదే అంశంపై చర్చ రగిల్చేందుకు ప్రయత్నిస్తోంది. తమవద్ద లక్షిత ప్రదేశాలను ధ్వంసం చేయగల అతి చిన్న వ్యూహాత్మక అణుబాంబులు కూడా ఉన్నాయని పాకిస్తాన్ రైల్వే మంత్రి షేక్ రషీద్ అహ్మద్ పేర్కొన్నారు. పంజాబ్ ప్రావిన్స్‌లో నిర్మిస్తున్న à°“ రైల్వే స్టేషన్ భవనాన్ని పరిశీలించేందుకు వచ్చిన ఆయన స్థానిక మీడియాతో మాట్లాడుతూ... ‘‘పాకిస్తాన్ దగ్గర 125 గ్రాముల నుంచి 250 గ్రాముల పరిమాణమంత(చాక్లెట్ బాంబ్ à°…à°‚à°¤ సైజులో) చిన్న బాంబులు కూడా ఉన్నాయి. లక్షిత ప్రదేశాన్ని అవి ధ్వంసం చేయగలవు...’’ అని పేర్కొన్నారు. ఎప్పుడైతే జమ్మూ కశ్మీర్‌à°•à°¿ స్వతంత్ర ప్రతిపత్తి రద్దు చేస్తూ భారత్ నిర్ణయం తీసుకుందో.. అప్పుడే à°† దేశంతో తమకు సంబంధాలు తెగిపోయాయన్నారు.
 
అణ్వస్త్ర సామర్థ్యం à°—à°² ఇరు దేశాల మధ్య కశ్మీర్ అంశంపై యుద్ధం తప్పదంటూ పాక్ ప్రధాని ఇమ్రాన్ ప్రకటించిన నేపథ్యంలోనే అక్కడి రైల్వే మంత్రి à°ˆ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. పాకిస్తాన్‌తో యుద్ధం కోరుకోవద్దనీ.. అదే జరిగితే అణ్వస్త్ర సామర్థ్యమున్న ఇరు దేశాలు నష్టపోతాయని ఇమ్రాన్ ఇటీవల పేర్కొన్నారు. కాగా శుక్రవారం భారత ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా వ్యాఖ్యానిస్తూ మరో పాకిస్తాన్ మంత్రి విద్యుత్ షాక్‌à°•à°¿ గురైన సంగతి తెలిసిందే. పాకిస్తాన్‌పై యుద్ధానికి వస్తే భారత్ 22 ముక్కలవుతుందంటూ ఆయన చెప్పుకొచ్చారు. à°† మరుక్షణమే ఆయనకు కరెంట్ షాక్ కొట్టడంతో ఉలిక్కిపడిన ఆయన.. మళ్లీ తేరుకుని తన సమావేశాన్ని మోదీ ఆపలేరంటూ వీరావేశం ప్రదర్శించారు. కాగా దక్షిణాసియాలో భయాందోళనలు సృష్టించేందుకే పాకిస్తాన్ అణుయుద్ధాన్ని బూచిగా చూపిస్తోందంటూ భారత విదేశాంగ శాఖ ఇటీవల పేర్కొంది.