గుర్తింపు కార్డు లేకపోవడంతో వలంటీర్లకు ఎదురుదెబ్బ

Published: Wednesday September 04, 2019
 à°¬à±‡à°¸à±‌ సర్వే కోసం ఇంటింటికీ తిరుగుతున్న వలంటీర్లకు ముచ్చెమటలు పడుతున్నాయి. అధికారులు ఇంతవరకు వలంటీర్లకు గుర్తింపు కార్డులు ఇవ్వకపోవడం సమస్యగా మారింది. సర్వే కోసం ఇంటింటికీ తిరుగుతున్న వలంటీర్లను నీవెవరువు? వలంటీరు అయితే గుర్తింపు కార్డు ఏది? కార్డు లేకుండా మేమెలా నమ్మాలి. నమ్మి వివరాలు ఎందుకు చెప్పాలి అని ప్రశ్నించడంతో వలంటీర్లు ఖంగుతింటున్నారు. అసలు అతను వలంటీరా? కాదా అనేది ధృవీకరించుకోలేక కొందరు వివరాలు కూడా సరిగా చెప్పడం లేదు. దీంతో సర్వే సమగ్రంగా జరగడం లేదు.
 
ఇటీవలే వలంటీర్ల వ్యవస్థ ప్రారంభమైన సంగతి తెలిసిందే. కానీ పూర్తి స్థాయిలో వాళ్లు ఉద్యోగాల్లో చేరలేదు. జిల్లా మునిసిపాలిటీల్లో మొత్తం 6043 వలంటీర్ల యూనిట్లు ఉన్నాయి. కానీ దరఖాస్తు చేసుకున్న వారు 4761 మాత్రమే. పైగా అందులో ఉద్యోగాల్లో చేరిన వారు 4189 మాత్రమే. ఇంకా 1854 మంది అవసరం. వీరిలో కొంతమందిని ఇంకా చేర్చుకుంటున్నట్టు సమాచారం. ఈలోపు ఇంటింటా సర్వే మొదలైంది. ఈనెల 5వతేదీకి à°ˆ సర్వే పూర్తి చేయాల్సి ఉంది. కానీ ప్రస్తుత పరిస్థితిని బట్టి మరికొన్ని రోజులు పట్టే అవకాశం ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. ప్రతి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యుల సంఖ్య, వృత్తి, ఆస్తి వివరాలు, ఆధార్‌ నెంబరు, కులం తదితర వివరాలు సేకరిస్తున్నారు. నివేశన, ఇంటి కోసం à°’à°• సర్వే ఫారం రూపొందించారు. 
 
లబ్ధిదారుడు తెల్లరేషన్‌కార్డు కలిగి ఉన్నారా? ఉంటే తెల్లరేషన్‌ కార్డు నెంబరు రాయాలి. రాష్ట్రంలో ఎక్కడైనా ఇంటి స్థలం ఉందా? ఇల్లు ఉందా? గతంలో ప్రభుత్వం మంజూరు చేసిన ఇల్లు ఉందా? లబ్ధిదారుడికి 2.5 ఎకరాలు మాగాణి లేదా 5 ఎకరాల మెట్ట భూమి ఉందా? లబ్ధిదారుడి సంవత్సర ఆదాయం రూ.3లక్షల కంటే తక్కువ కలిగి ఉన్నారా? లబ్ధిదారుడు పీఎంఏవై పథకంలో ఇల్లు మంజూరైందా? ఏ పథకం ద్వారా లబ్ధి పొంది ఉన్నారు? అందులో ఏహెచ్‌పీ జీ+3, డీఎల్‌సీ, సీఎల్‌ఎస్‌ తదితర పథకాలు వివరించాలి. ఏహెచ్‌పీ పథకం à°•à°¿à°‚à°¦ కేటాయిస్తే మంజూరు పత్రం ఇచ్చారా? ఇటువంటి వివరాలన్నీ ఇవ్వాల్సి ఉంది. అందులో లబ్ధిదారుడు నివేశన స్థలం లేదా ఇంటికోసం అర్హుడై ఉన్నాడో? లేదో కూడా స్పష్టం చేయాల్సి ఉంది. అర్హుడైతే విచారణాధికారి సంతకం పెట్టాలి. పర్యవేక్షణాధికారి సంతకం కూడా ఉండాలి. 
 
 
నగరాల్లో 1854మంది కొరత ఉంది. అమలాపురంలో 290వలంటీర్లు యూనిట్‌లు ఉండగా, 276మంది ఉద్యోగంలో చేరారు. గొల్లప్రోలులో 160 యూనిట్లు ఉండగా 97మంది ఉద్యోగంలో చేరారు. కాకినాడలో 2027యూనిట్లు ఉండగా 1559మంది దరఖాస్తు చేసు కున్నారు. అందులో 1308మంది ఉద్యోగం పొందారు. మండపేటలో 322 యూనిట్లు ఉన్నాయి. 300మంది దరఖాస్తు చేసుకున్నారు. 272మంది ఉద్యోగంలో చేరారు. ముమ్మిడివరంలో 141 యూనిట్లు ఉండగా 132మంది దరఖాస్తు చేసుకున్నారు. 167మంది ఉద్యోగంలో చేరారు. పెద్దాపురంలో 243 యూనిట్లు ఉండగా 197మంది దరఖాస్తు చేసుకున్నారు. 188 మంది ఉద్యోగంలో చేరారు. పిఠాపురంలో 279 యూనిట్లు ఉండగా 243మంది ఉద్యోగంలో చేరారు. రాజమహేంద్రవరంలో 1695 యూనిట్లు ఉండగా 1166మంది దరఖాస్తు చేసుకున్నారు. కానీ 932మంది మాత్రమే ఉద్యోగంలో చేరారు. రామచంద్రపురంలో 213 యూనిట్లు ఉండగా 187మంది దరఖాస్తు చేసుకున్నారు. 164మంది ఉద్యోగంలో చేరారు. సామర్లకోటలో 270 యూనిట్లు ఉండగా 206మంది ఉద్యోగంలో చేరారు. తునిలో 304 యూనిట్లు ఉండగా 259మంది దరఖాస్తు చేసుకున్నారు. 236మంది జాయిన్‌ అయ్యారు.