ఆర్టీసీ సిబ్బంది ఇక ప్రభుత్వ ఉద్యోగులే

Published: Thursday September 05, 2019
ఆర్టీసీ సిబ్బందిని ఊరిస్తున్న తీపి à°•à°² ఎట్టకేలకు నిజమయింది. వారందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రకటించి, బోన్‌సగా వారి ఉద్యోగ విరమణ వయసునూ పెంచారు. అలాగే, మూడునెలలకుపైగా నిలిచిపోయిన రీచ్‌లు కొత్త ఇసుక విధానంతో తిరిగి అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం à°ˆ మేరకు అతి కీలక నిర్ణయాలను తీసుకొంది. ఆర్టీసీ విలీనంపై ఆంజనేయరెడ్డి కమిటీ చేసిన సిఫారసులను యథాతథంగా కేబినెట్‌ ఆమోదించింది. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించేందుకు అంగీకారం తెలిపింది. రవాణాశాఖ à°•à°¿à°‚à°¦ ప్రత్యేకించి ప్రజా రవాణా శాఖ ఏర్పాటు చేయాలని మంత్రి వర్గం నిర్ణయం తీసుకుంది.
 
కేబినెట్‌ నిర్ణయాలను సమావేశం అనంతరం రవాణా శాఖ మంత్రి పేర్ని నాని మీడియాకు వెల్లడించారు. ‘‘ఆర్టీసీ విలీనంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆంజనేయరెడ్డి కమిటీ ప్రధానంగా 5 రకాల ప్రతిపాదనలు ప్రభుత్వం ముందుంచింది. వాటిని యథాతథంగా కేబినెట్‌ ఆమోదించింది. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ప్రజా రవాణా విభాగంలోకి తీసుకోవాలని కేబినెట్‌ నిర్ణయించింది. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు కూడా యథాతథంగా ప్రభుత్వ పరిధిలోకి వస్తారు. 15 రోజుల్లో విధివిధానాలు సిద్ధం చేసి, ఆర్టీసీలోని 52,000 మంది ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తాం. ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో ఆర్టీసీ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 58 నుంచి 60 ఏళ్లకు పెంచుతున్నాం.
 
మూడు నెలల్లో à°ˆ ప్రక్రియను పూర్తి చేయాలని న్యాయ, ఆర్థిక, సాధారణ పరిపాలన, రవాణా శాఖాధికారులను సీఎం ఆదేశించారు. ఆర్టీసీలో ప్రస్తుతం ఉన్న కాంట్రాక్టు కార్మికులు యథాతథంగా ఆర్టీసీ ప్రజా రవాణా శాఖలో కాంట్రాక్టు కార్మికులుగా కొనసాగుతారు. బస్సు చార్జీలపై స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన నియంత్రణ వ్యవస్థ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. à°ˆ విలీనం ద్వారా ఆర్టీసీకి సంబంధించిన రూ.3330 కోట్ల ఆర్థిక బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుంది’’ అని మంత్రి పేర్ని నాని వెల్లడించారు.