నీటి నిర్వహణలో ఘోర వైఫల్యం

Published: Wednesday September 11, 2019
మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తుంటే.. దాని ప్రభావం తమపై పడుతుందని ముందస్తుగా గ్రహించిన కర్ణాటక ప్రభుత్వం ముందే మేలుకుంది. ఆలమట్టి సామర్థ్యం కంటే.. 29 టీఎంసీలు తక్కువగా నీటిని నిల్వ చేసుకుని.. వరదను తట్టుకునేలా పకడ్బందీ చర్యలు తీసుకుంది. కానీ దిగువన ఉన్న ఆంధ్రప్రదేశ్‌ మాత్రం వరద వచ్చినప్పుడు చూద్దామన్న నిర్లక్ష్య ధోరణితో ఉంది. శ్రీశైలం జలాశయంలో ‘కుషన్‌’ లేకుండా నీరు నిండిపోయే పరిస్థితి కొనితెచ్చుకుంది. à°ˆ తీరును నిపుణులు తప్పుబడుతున్నారు. ప్రస్తుతం జలాశయం నిండిపోయి.. క్రస్ట్‌ గేట్లకు పై నుంచి కిందకు నీళ్లు పొంగిపొర్లుతున్నాయి. ఇలా à°…à°‚à°¤ ఎత్తు నుంచి నీరు జాలువారుతుంటే.. 2009లో జలాశయంలో పడ్డ గోతులు మరింత పెద్దవైతే.. ఆనకట్ట భద్రతకు ముప్పువాటిల్లుతుందని నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. కేంద్ర జల సంఘంతో, ఎగువన ఉన్న కర్ణాటక రాష్ట్ర నీటిపారుదల శాఖ అధికారులతో మనవాళ్లు కనీసం సంప్రదింపులైనా జరపకపోవడం శోచనీయమంటున్నారు. నాగార్జున సాగర్‌ నుంచి నీరు విడుదలవుతున్నా.. కుడి, à°Žà°¡à°® కాలువల నుంచి రైతులకు నామమాత్రంగా జలాలు వదలడంపై రైతాంగం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
 
శ్రీశైలం జలాశయంలో 885 అడుగుల ఎత్తుకు జలాలు చేరితే తప్ప పోతిరెడ్డిపాడు నుంచి నీటిని కిందకు వదిలేదిలేదని జలవనరుల శాఖ అధికారులు భీష్మించుకు కూర్చున్నారు. పోతిరెడ్డిపాడు సామర్థ్యం మేరకు 44,000 క్యూసెక్కుల నీటిని పూర్థిస్థాయిలో విడుదల చేయకుండా.. ఇప్పటికీ 28,500 క్యూసెక్కులే విడిచిపెడుతున్నారు. 15,500 క్యూసెక్కుల నీటిని తక్కువగా విడుదల చేస్తుండడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రోజుకు రెండు టీఎంసీల చొప్పున రాయలసీమకు నీటిని తరలించే అవకాశం ఉన్నా అధికారులు à°† దిశగా చర్యలు తీసుకోకపోవడంపై నిపుణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎగువ నుంచి నీటి ప్రవాహం లక్షల క్యూసెక్కులు ఉరకలెత్తుకుంటూ వస్తున్నా జల ప్రణాళికలు అమలు చేయకుండా అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని తప్పుబడుతున్నారు. జల వనరులశాఖలో ప్రావీణ్యం కలిగిన రిటైర్డ్‌ ఇంజనీర్‌ బీఎ్‌సఎన్‌ రెడ్డి ముఖ్యమంత్రి కార్యాలయంలో సలహాదారుగా ఉన్నప్పటికీ అధికారుల్లో ఇలాంటి నిర్లక్ష్య ధోరణి ఎందుకు నెలకొందని వారు ప్రశ్నిస్తున్నారు.
 
ఆ గోతితో ప్రమాదం..
శ్రీశైలంలో పూర్తిస్థాయి నీటిమట్టం నిర్వహణ పేరుతో క్రస్ట్‌గేట్ల నిర్వహణపై ఇంజనీర్లు అలసత్వం ప్రదర్శిస్తున్నారు. ఫలితంగా డ్యాంలో మూసి ఉన్న గేట్లపై నుంచి వరద నీరు ప్రవహించింది. దీనివల్ల డ్యాంకు ఎలాంటి ప్రమాదం లేకపోయినా.. నీరు విడుదల చేసిన 6à°µ నంబరు గేటుకు ఎదురుగా ఉన్న 150 అడుగుల గోతిపై ప్రభావం ఉంటుందని.. తక్కువ గేట్లను ఎత్తడంతో నీటి ప్రభావం à°† గోతిపై పడడం వల్ల డ్యాం పునాదులు ప్రమాదంలో పడతాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. వరద నీరు పెరగబోతుందని సోమవారం సీడబ్ల్యుసీ నివేదిక ఆధారంగా అయినా అధికారులు ముందస్తు చర్యలు తీసుకుంటే బాగుండేదని అంటున్నారు. సోమవారం 6 గేట్లను పదడుగుల మేర ఎత్తగా.. మంగళవారం ఉదయం నుంచి గేట్లకు పైగా వరద నీరు లీక్‌ అవుతుండడంతో డ్యాం 6 క్రస్ట్‌గేట్లను 17 అడుగుల ఎత్తు వరకు తెరిచి నీటిని కిందకు విడుదల చేశారు. అప్పటికే జలాశయం దాదాపు పూర్తిస్థాయి 884.90 అడుగులకు చేరుకుంది. జలాశయానికి వస్తున్న వరదను ముందుగానే అంచనా వేయడంలో ఇంజనీర్లు విఫలం కావడంతో తెరవని 1, 2, 3, 10, 11, 12 క్రస్ట్‌గేట్లపై నుంచి à°—à°‚à°Ÿ పాటు ప్రవహించింది. పరిస్థితిని గమనించి ఇంజనీర్లు తెరచిన 6 క్రస్ట్‌గేట్ల ఎత్తును 23 అడుగులకు ఎత్తారు. దీంతో క్రస్ట్‌గేట్ల పైనుంచి వరద నిలిచింది. ప్రాజెక్టు సూపరింటెండింగ్‌ ఇంజనీర్‌ శ్రీనివాసరెడ్డి డ్యాం వద్దకు చేరుకుని క్రస్ట్‌గేట్ల నుంచి ప్రవహిస్తున్న వరదను పరిశీలించారు. జలవనరుల శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జలాశయంలో పూర్తిస్థాయి నీటి నిల్వలను ఉంచుతున్నామని అనంతరం తెలిపారు. ఇది సాధారణ ప్రవాహమేనని, క్రస్ట్‌గేట్లపై నుంచి వరద నీరు ప్రవహించడం వల్ల జలాశయానికి ఎటువంటి ఇబ్బందీ లేదని.. భద్రతకు ఎటువంటి ఢోకా లేదని తెలిపారు