సచివాలయ పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీ!

Published: Friday September 20, 2019
ఆంధ్రప్రదేశ్‌ గ్రామ సచివాలయ పరీక్షల్లో భారీ బాగోతం చాపకింద నీరులా సాగిపోయింది. గురువారం ఫలితాలు ప్రకటించిన వెంటనే à°ˆ పరీక్షల్లో జరిగిన గూడుపుఠాణి బట్టబయలైంది. ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ కార్యాలయం కేంద్రంగా జరిగిన కుట్ర రాష్ట్ర వ్యాప్తంగా పాకినట్లు తెలుస్తోంది. సర్వీసు కమిషన్‌ ఉద్యోగులు కొందరు ప్రశ్నపత్రం సంపాదించి తాము ప్రయోజనం పొందడంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా అనేక మందికి à°ˆ పేపర్లు అందజేసి ఉంటారని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గురువారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి స్వహస్తాలతో విడుదల చేసిన ఫలితాల్లో కేటగిరి-1లో జి.అనితమ్మ(అనంతపురం) అనే యువతి టాప్‌ ర్యాంకర్‌à°—à°¾ నిలిచారు. ఏపీపీఎస్సీలో పరీక్షల వ్యవహారాలు చూసే కాన్ఫిడెన్షియల్‌ విభాగంలో ఔట్‌సోర్సింగ్‌ విధానంలో జూనియర్‌ అసిస్టెంట్‌à°—à°¾ అనితమ్మ పనిచేస్తున్నారు. కేటగిరి-3లో ఫస్ట్‌ ర్యాంకర్‌à°—à°¾ నిలిచిన దొడ్డా వెంకట్రామిరెడ్డి(ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం)సొంత అన్న మల్లికార్జునరెడ్డి ఇదే ఏపీపీఎస్సీలో ఏఎ్‌సవోగా పనిచేస్తున్నారు. కేటగిరి-1లో మూడో ర్యాంకు కూడా ఆయనకే వచ్చింది. కేటగిరి-3లో రెండో ర్యాంకర్‌à°—à°¾ నిలిచిన వెన్నా మహేశ్వరరెడ్డి కూడా ఏపీపీఎస్సీలోనే పనిచేస్తుండటం గమనార్హం. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన సచివాలయ పరీక్షల్లో అంతా పకడ్బందీగా చేశామని ముఖ్యమంత్రి, అధికారులు బల్లగుద్ది చెప్పినప్పటికీ లోలోపల చాలా వ్యవహారాలు నడిచినట్లుగా à°ˆ ఫలితాలే చెబుతున్నాయి.
 
 
సాధారణంగా సర్వీసు కమిషన్‌లో పనిచేసేవారు à°† విభాగం నిర్వహించే పరీక్షలు రాసే పక్షంలో వారిని à°† విభాగానికి దూరంగా ఉంచుతారు. కానీ à°ˆ దఫా మాత్రం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేదు. పైగా కొందరు కీలక అధికారులు కుమ్ముక్కై అస్మదీయులకు పేపర్లు అందించేందుకు వీలుగా వారిని అలాగే వదిలేశారని తెలుస్తోంది. ఏపీపీఎస్సీ ఉద్యోగులు స్వప్రయోజనాలకోసం అధికార దుర్వినియోగానికి పాల్పడి పేపర్లు లీక్‌ చేసుకున్నట్లే, బయట వారికి కూడా వెళ్లిపోయాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేటగిరి-1లో ఫస్ట్‌ ర్యాంకర్‌à°—à°¾ ఉన్న అనంతపురం జిల్లాకు చెందిన జి.అనితమ్మ à°—à°¤ కొంత కాలంగా ఔట్‌సోర్సింగ్‌లో జూనియర్‌ అసిస్టెంట్‌à°—à°¾ పనిచేస్తున్నారు. గతంలో ఏపీపీఎస్సీ నిర్వహించిన పలు పోటీ పరీక్షలకు హాజరైనప్పటికీ ఎక్కడా ఎంపికకాలేదు. ఈసారి మాత్రం తానే ప్రశ్నపత్రం టైపు చేయడంతో టాపర్‌à°—à°¾ నిలిచారని అక్కడ ఉద్యోగులే ఆరోపిస్తున్నారు. అదే కార్యాలయంలో ఏఎ్‌సవోగా పనిచేస్తున్న మల్లికార్జునరెడ్డి సొంత తమ్ముడు వెంకట్రామిరెడ్డికి మూడో ర్యాంకు వచ్చింది.
 
వాస్తవానికి సచివాలయ పరీక్షల్లో పెద్ద గూడుపుఠాణి నడుస్తోందని, కొందరికి ప్రయోజనం కూర్చేలా స్కెచ్‌ వేశారని, వారికే ఉద్యోగాలు వచ్చేలా à°•à°¥ నడుస్తోందని  కొద్ది రోజుల కిందటే ఉద్యోగార్థులు సమాచారమందించారు. ప్రతిభావంతులను పక్కనబెట్టి కొద్ది మందికి ప్రశ్నపత్రాలు ముందుగా అందిస్తున్నారని వారు ఆరోపించారు. తగిన సాక్ష్యాధారాలు లేకపోవడంతో  వాటిని పరిగణనలోకి తీసుకోలేదు. కానీ ఫలితాలు ప్రకటించిన కొన్ని నిమిషాల్లోనే భారీ సంఖ్యలో అభ్యర్థులు మొత్తం వ్యవహారాన్ని బట్టబయలు చేస్తూ  ఉప్పు అందించారు. పూర్తి స్థాయిలో పరిశీలన అనంతరం వారి ఆరోపణ నిజమేనని, సర్వీసు కమిషన్‌లో పనిచేస్తున్న à°† ముగ్గురే కాకుండా అనేక జిల్లాల్లో చాలా మందికి à°ˆ పేపర్లు వెళ్లిపోయాయని తెలుస్తోంది