10,000 చలానాకు కేవలం రూ.100 కడితే చాలు

Published: Saturday September 21, 2019
కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన మోటార్ వెహికిల్ 2019 చట్టంతో వాహనదారులు బెంబేలెత్తుతున్నారు. కొత్త చట్టం ద్వారా చలానాలు భారీ స్థాయిలో విధిస్తుండటంతో చాలా మంది పబ్లిక్ వాహనాలనే ఆశ్రయిస్తున్నారు. అయితే ట్రాఫిక్ చలన్లా గురించి అంతగా భయపడనవసరం లేదంటూ à°“ పోలీసు అధికారి చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌à°—à°¾ మారింది. వారం à°•à°¿à°‚à°¦ పోస్టు చేసిన à°ˆ వీడియోను ఇప్పటి వరకు 9.7 మిలియన్ల మంది చూశారు. ట్రాఫిక్ చలాన్లు వాహనదారులను ఎంతగా భయపెడుతున్నాయో à°ˆ వీడియోను చూసిన వీక్షకుల సంఖ్య చూస్తేనే తెలుస్తుంది.
 
డ్రైవింగ్ లైసెన్స్, ఆర్‌సీ, పొల్యూషన్ సర్టిఫికేట్ లేకుండా బండినడిపి ట్రాఫిక్ పోలీసులకు పట్టుబడితే కేవలం రూ. 100 మాత్రమే చెల్లించే వెసులుబాటు చట్టంలో ఉందని సునీల్ సంధు తన వీడియోలో వివరించాడు. వాస్తవానికి కొత్త చట్టం ప్రకారం లైసెన్స్, ఆర్‌సీ లేకుండా పట్టుబడితే రూ.5000, పొల్యూషన్ సర్టిఫికేట్ లేకుంటే రూ.10,000 జరిమానా విధిస్తారు. అయితే పోలీసులు జరిమానా విధించగానే వాహనదారులు కంగారు పడాల్సిన అవసరం లేదంటాడు సునీల్ సంధు. ఇంతకు వీడియోలో అతను ఏం చెప్పాడంటే..
 
డ్రైవింగ్ లైసెన్స్, ఆర్‌సీ, పొల్యూషన్ సర్టిఫికేట్ ఉండీ ఇంట్లో మర్చిపోవడం ద్వారా చాలా మంది చలానాల బారిన పడుతుంటారు. సాధారణంగా చలానా విధించిన 15 రోజులలోగా సంబంధిత మొత్తాన్ని పోలీసులకు చెల్లించాల్సి ఉంటుంది. అయితే పై ధ్రువపత్రాలు ఇంట్లో మర్చిపోయి చలానా బారిన పడిన వాహనదారులు 15 రోజుల్లోగా సంబంధిత పత్రాలను ట్రాఫిక్ అధికారులకు చూపిస్తే వారు కేవలం రూ. 100 మాత్రమే కట్టాల్సి ఉంటుందని వివరించాడు. à°ˆ నిబంధన కొత్త చట్టంలోనే ఉందని సంధు పేర్కొన్నాడు.
 
అయితే తాగి బండి నడపడం, హెల్మెట్, సీటు బెల్ట్ పెట్టుకోకపోవడం, ఫోన్ మాట్లాడుతూ బండి నడపడం వల్ల విధించే చలాన్లకు ఈ నిబంధన వర్తించదని ఆయన వివరించాడు. కాగా ప్రజలకు ఎంతో ఉపయోగకరమైన ఈ వీడియోను వారంలోనే 9.7 మిలియన్ల మంది చూడటంతో పాటు ఇతరులకు షేర్ చేస్తూ సంధుకు ధన్యవాదాలు తెలుపుతున్నారు.