స్థానిక ఎన్నికల్లో ప్రజల్లోకి వెళ్లలేం

Published: Sunday September 22, 2019
ఇసుక కొరతపై ప్రజల్లో అసంతృప్తి రోజురోజుకూ పెరుగుతోందని, ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని స్వయానా అధికార పార్టీ ప్రజా ప్రతినిధులే తీవ్ర ఆందోళన వ్యక్తంచేశారు. కొత్తవిధానం తీసుకువచ్చినా ఇంకా ఇబ్బందులు తొలగలేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఇసుక లభించకపోవడంతో భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి దొరకడం లేదని చెప్పారు. à°ˆ పరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే ప్రజల్లోకి వెళ్లలేమని స్పష్టం చేశారు. విశాఖపట్నం జిల్లా ఇన్‌చార్జి మంత్రి మోపిదేవి వెంకటరమణ అధ్యక్షతన శనివారం కలెక్టరేట్‌లో జరిగిన సమీక్షకు వైసీపీపీ నేత విజయసాయిరెడ్డి, జిల్లా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు.
 
శాఖలపై సమీక్షించే ముందు ఇసుకపై చర్చ జరిగింది. ఇసుక సమస్య మరింత పెరగడంతో ప్రజల్లో అనేక అపోహలు తలెత్తాయని మంత్రి ముత్తంశెట్టి తెలిపారు. విశాఖలో రీచ్‌లు లేవని.. కొత్తగా అమలుచేస్తున్న ఆన్‌లైన్‌ విధానం ఇంకా ప్రజలకు అర్థం కాలేదని చెప్పారు. ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసిన ఇసుకను కొందరు బ్లాక్‌లో అమ్ముకుంటున్నారన్నారు. à°—à°¤ ప్రభుత్వ హయాంలో విశాఖలో రూ.20 వేలకు లభించిన లారీ లోడు ఇసుక ఇప్పుడు రూ.60 నుంచి రూ.70 వేలకు పెరిగిందని ఆందోళన వ్యక్తంచేశారు. శ్రీకాకుళంలో à°’à°• రీచ్‌ను విశాఖకు కేటాయించి.. అక్కడ డిప్యూటీ కలెక్టర్‌ హోదా కలిగిన అధికారిని నియమించి.. నగరానికి రోజూ ఇసుక సరఫరా అయ్యేలా చూడాలని కోరారు. ఇసుక సరఫరాలో ఇబ్బంది ఉన్నమాట వాస్తవమేనని మోపిదేవి అంగీకరించారు. ప్రస్తుతం నదుల్లో వరదల కారణంగా ఇసుక లభ్యత తగ్గిందని, త్వరలో సమస్య పరిష్కరిస్తామన్నారు. విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ మాట్లాడుతూ.. ఇసుక కొరతతో నగరంలో అనేక రంగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని తెలిపారు. నదుల్లో ఇసుకకు ప్రత్యామ్నాయంగా రోబోశాండ్‌ను ప్రోత్సహించాలని సూచించారు. ఇసుక లభ్యత లేక గాజువాకలో లక్ష మందికిపైగా కార్మికులు ఉపాధి కోల్పోయారని గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి చెప్పారు.
 
జిల్లా గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇసుక సమస్య తీవ్రంగా ఉందని ప్రభుత్వ విప్‌ బూడి ముత్యాలనాయుడు చెప్పారు. సొంత అవసరాలకు ఎడ్ల బండ్లపై ఇసుక తెచ్చుకుంటుంటే కేసులు పెడుతున్నారని ఫిర్యాదుచేశారు. ప్రభుత్వ విభాగాల్లో పనుల కోసం ఇసుక రవాణా చేసే ఎడ్లబండ్లపైనా కేసులు బనాయిస్తున్నారని చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ఆక్షేపించారు. సొంత అవసరాలకు తెచ్చుకునే వారిపై కేసులు పెట్టడం మంచిది కాదని అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌ అన్నారు. కేసులు వద్దని చెప్పినా ఎందుకు పెడుతున్నారని మంత్రి ముత్తంశెట్టి పోలీసులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. కలెక్టర్‌ వినయచంద్‌ జోక్యం చేసుకుని.. రెండురోజుల్లో సమస్య పరిష్కరిస్తానన్నారు.