యురేనియం తవ్వకాలపై 29న రౌండ్‌టేబుల్‌ సమావేశం

Published: Tuesday September 24, 2019
à°•à°¡à°ª జిల్లాలోని యురేనియం కర్మాగారం చూపుతున్న దుష్ప్రభావాలపై ఏమేం చర్యలు తీసుకున్నారో తెలియజేయాలని రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలిని హైకోర్టు ఆదేశించింది. పూర్తి వివరాలతో కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను అక్టోబరు 1à°•à°¿ వాయిదా వేసింది. యురేనియం కర్మాగారం వెలువరించే వ్యర్థాలతో చుట్టుపక్కల పరిసరాలు విషతుల్యం అవుతున్నాయని, తద్వారా ప్రజలు అనారోగ్యం పాలవుతున్నందున దానిని మూసివేయించాలని కోరుతూ విశాఖ సివిల్‌ లిబర్టీస్‌ అధ్యక్షుడు ఎన్‌హెచ్‌ అక్బర్‌ దాఖలు చేసి ప్రజా ప్రయోజనంపై సోమవారం హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి సి.ప్రవీణ్‌కుమార్‌, జస్టిస్‌ à°Žà°‚.సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మాసనం విచారించింది.
 
‘యురేనియం తవ్వకాలు-అనర్థాలు, ప్రమాదాలు’ అనే అంశంపై à°ˆ నెల 29à°¨ రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహిస్తున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ తెలిపారు. విజయవాడలో జరిగే à°ˆ సమావేశానికి ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు జగన్‌, కేసీఆర్‌, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌, టీడీపీ ఏపీ, తెలంగాణ అధ్యక్షులు కళావెంకట్రావ్‌, ఎల్‌.రమణ, సీపీఐ, సీపీఎం ఏపీ, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శులను ఆహ్వానించినట్లు ఆయన తెలిపారు.