పార్లమెంటులో బిల్లును అడ్డుకున్న ఇమ్రాన్‌ సర్కారు

Published: Saturday October 05, 2019

మ్రాన్‌ఖాన్‌ నేతృత్వంలోని పాకిస్థాన్‌ సర్కారు మరోసారి ముస్లిం మతవాద పోకడలను చాటుకుంది. దేశాధ్యక్షుడిగా, ప్రధానిగా ముస్లింలు మాత్రమే ఉండాలని, ఇతర మతాలవారికి à°† అవకాశమే లేదని తెలిపింది. ముస్లిమేతరులు కూడా à°ˆ పదవులను అధిష్ఠించేందుకు వీలుగా పాకిస్థాన్‌ పీపుల్స్‌ పార్టీకి చెందిన క్రిస్టియన్‌ ఎంపీ నవీద్‌ ఆమిర్‌ జీవా పార్లమెంటులో ప్రవేశపెట్టిన రాజ్యాంగ సవరణ బిల్లును అడ్డుకుంది. పాకిస్థాన్‌.. ఇస్లామిక్‌ గణతంత్ర దేశమని, దేశాధ్యక్షుడు, ప్రధాని పదవులకు ముస్లిం మాత్రమే అర్హుడవుతారని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయమంత్రి అలీ మహ్మద్‌ పేర్కొన్నారు.