5వేల టన్నుల ఎర్రచందనం వేలానికి గ్లోబల్‌ టెండర్లు

Published: Saturday October 05, 2019

‘ఎర్రచందనం పరిరక్షణ కోసం అవసరమైన తుపాకులిచ్చాం. ఇకపై ధైర్యంగా తుపాకులు చేతపట్టి అడవుల్లోకి వెళ్లండి. స్మగ్లర్ల భరతం పట్టండి’ అంటూ అటవీ అధికారులు, సిబ్బందికి రాష్ట్ర మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సూచించారు. తిరుపతిలోని ఎస్వీ జూపార్కులో శుక్రవారం నిర్వహించిన 65à°µ వన్యప్రాణి వారోత్సవాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అటవీశాఖ డీఆర్వో, ఎఫ్‌బీవో, ఎఫ్‌ఎ్‌సవో స్థాయి అధికారులకు మంత్రి తుపాకులను అందజేశారు. అనంతరం వారిని ఉద్దేశించి మాట్లాడారు. ఎర్రచందనాన్ని అక్రమంగా తరలిస్తూ ఎంతటి వారు పట్టుబడినా ఉపేక్షించవద్దని స్పష్టం చేశారు. చివరకు తమ మంత్రులు, ఎమ్మెల్యేలు సిఫారసు చేసినా వదిలిపెట్టొదన్నారు. శేషాచల అడవుల్లో నుంచి అక్రమంగా తరలిస్తూ పట్టుబడిన 5 వేల టన్నుల ఎర్రచందనం వేలానికి సిద్ధంగా ఉందని, కేంద్రం నుంచి అనుమతులు రాగానే గ్లోబల్‌ టెండర్‌ ద్వారా వేలం వేస్తామని మంత్రి తెలిపారు. అటవీ, వన్యప్రాణి సంరక్షణకు అవసరమైన నిధుల మంజూరు కు సీఎం జగన్‌ సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు.